Home /News /andhra-pradesh /

GUNTUR ANDHRA PRADESH MUSLIM YOUTH FUNERAL WOMAN WHO DIED DUE CORONA IN GUNTUR NGS

కోవిడ్ ఫైటర్స్. ఒక్క ఫోన్ చేస్తే చాలు. కరోనాకు బలైన హిందూ మహిళకు ముస్లిం యువత అంత్యక్రియలు

మానవత్వం చాటుకున్న ముస్లిం యువత

మానవత్వం చాటుకున్న ముస్లిం యువత

కోవిడ్ ఫైటర్స్ కు సలామ్ అనాల్సిందే. ఒక్క ఫోన్ వస్తే చాలు ఎంత దూరమైనా వెంటనే వాలిపోతారు. ముఖ్యంగా కరోనా కారణంగా చనిపోయి.. అంత్యక్రియలు జరిపించడానికి ఎవరూ లేకుంటే.. తాము ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు ముస్లిం యువత.

    ఓ వైపు ప్రజలను కరోనా కాటు వేస్తుంటే.. మరోవైపు జనం మానవత్వం మరచిపోతున్నారు. కష్ట సమయంలో అండగా నిలవాల్సిన మనుషులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు చూస్తే మనిషి అన్నవాడు మయామైపోతున్నాడనే భయం పెరుగుతోంది. మొన్న నెల్లూరులోని ఓ అపార్ట్ మెంట్ లో కరోనా సోకిందనే కారణంతో ఒక కుంటుబాన్ని ఇంట్లో ఉంచి బయట తాళం వేశారు అపార్ట్ మెంట్ అసోసియేషన్ వారు. ఆ ఘటన మరిచిపోకముందే నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని, పెదపేటలో జరిగిన ఓ ఘటన అందరితో కన్నీళ్లు పెట్టించింది.

    ఓ ఇంట్లో 85 ఏళ్ల ఏకుల మరియమ్మ, ఆమె కుమారుడితో కలిసి అద్దెకు ఉంటోంది. నాలుగు రోజుల కిందట మరియమ్మ అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో ఆమె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. కరోనా అని భయపడి అందుకు సంబంధించి పరీక్ష చేయించుకుంది. ఆమెకు కోవిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు వెంటనే ఇంటికి పంపించేశారు. వైద్యులు అయితే కనికరించారు. కాని ఇంటి యజమాని మాత్రం కఠినంగా వ్యవహరించాడు. వారిని ఇంట్లోకి రానివ్వకుండా బయటకు గెంటేశాడు. దీతో ఆ మహిళ సహా అతడి కొడుకు రాత్రంతా శ్వశానంలోనే జాగారం చేయాల్సి వచ్చింది.

    ఇక చాలా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక వేళ ఎవరైనా కరోనాతో చనిపోతే వారికి కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో ముస్లిం యువత మానవత్తం చాటుకుంది. కరోనా వచ్చిన వారిని దగ్గర ఉండి చూడడానికి రక్త సంబంధీకులే భయపడుతుంటే. ఆ బాధితులకు వారి వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు గుంటూరుకు చెందిన ముస్లిం యువకులు.

    గుంటూరు జిల్లా మండల కేంద్రమైన దుగ్గిరాలలో 48 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోవడంతో కుటుంబీకులు భౌతికకాయాన్ని ముట్టుకునేందుకు భయపడిపోయారు. సామాజిక మాధ్యమాల ద్వారా గుంటూరు కోవిడ్‌ ఫైటర్స్‌ గురించి తెలుసుకుని వారిని సంప్రదించారు. దీంతో కోవిడ్‌ ఫైటర్స్‌కు చెందిన పఠాన్‌ అల్లాభక్షు, పఠాన్‌ ఫిరోజ్‌ఖాన్, హబీబ్‌ అన్సారీ, పఠాన్‌ ముజీబ్‌బాషా తమ సొంత అంబులెన్స్‌లో దుగ్గిరాల వెళ్లారు. సదరు మహిళ భౌతిక కాయాన్ని తెనాలి శ్మశానవాటికకు తరలించి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

    గతేడాది నుంచి ఇప్పటివరకు తాము కరోనాతో చనిపోయిన 223 మందికి అంత్యక్రియలు చేశామని వారు తెలిపారు. కరోనాతో చనిపోయిన వారికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేసే పరిస్థితి లేనప్పుడు.. తమను సంప్రదిస్తే ఆ కార్యం నెరవేరుస్తామని చెప్పారు. 8143222456, 9848940304 నంబర్లలో తమను ఎవరైనా సంప్రదించాలని కోరుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Corona, Corona cases, Corona drug, Corona positive, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు