Home /News /andhra-pradesh /

GUNTUR ANDHRA PRADESH MAN LIVE IN RELATION WITH WOMAN AND WANTS TO MARRY HER DAUGHTER IN GUNTUR DISTRICT SU

Andhra Pradesh: మహిళతో స‌హ‌జీవ‌నం.. కూతురిని ఇచ్చి పెళ్లి చేయాల‌ని ఒత్తిడి.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

భ‌ర్త‌ను వ‌దిలేసిన మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం పెట్టుకున్న వ్య‌క్తి.. ఆమె కూతురిపై కూడా క‌న్నేశాడు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

    భ‌ర్త‌ను వ‌దిలేసిన మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం పెట్టుకున్న వ్య‌క్తి.. ఆమె కూతురిపై కూడా క‌న్నేశాడు. ఆమె కూతురిని త‌న‌కిచ్చి పెళ్లి చేయాల‌ని.. వారిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్నాడు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివ‌రాలు.. ఓ మ‌హిళ భ‌ర్త‌ను వ‌దిలేసి కూతురితో క‌లిసి ఒంట‌రిగా జీవ‌నం సాగిస్తుంది. ఆమెతో మంగ‌ళ‌గిరికి చెందిన గోలి సాంబ‌శివ‌రావు కొన్నేళ్లుగా వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. మ‌రోవైపు ఆ మ‌హిళ కూతురు ప్ర‌స్తుతం డిగ్రీ చ‌దువుతోంది.

    గ‌త కొన్ని రోజులుగా మ‌హిళ‌.. త‌న కూతురికి పెళ్లి చేయాలని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సంబంధాల‌ను కూడా వెతికే ప‌నిలో ప‌డింది. అయితే మ‌హిళ కూతురిపై క‌న్నేసిన.. సాంబ‌శివ‌రావు.. ఆ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవ‌డం చేస్తున్నాడు. ఇక‌, త‌ల్లితో స‌హ‌జీవ‌నం చేస్తున్న సాంబ‌శివ‌రావును ఆ యువ‌తి తండ్రిగానే పిలుస్తోంది. అయితే సాంబ‌శివ‌రావు త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని అన‌డంతో.. ఆ యువ‌తి తీవ్ర ఆవేశానికి లోనైంది. అత‌ని చ‌ర్య‌ల‌కు ఎదురు తిరిగింది.

    ఇవి చ‌ద‌వండి: తీవ్ర విషాదం.. 17 రోజుల వ్యవధిలో అత్తారిళ్లలో మృతిచెందిన అక్కాచెల్లెళ్లు.. అసలేం జరిగిందంటే..
     Illicit Affair: లాయర్‌, నర్సుకు మధ్య వివాహేతర సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే..


    దీంతో సాంబ‌శివ‌రావు.. మ‌హిళ‌తో పాటుగా ఆమె కూతురుని వారం రోజులుగా ఇంట్లో బంధించి చిత్ర‌హింస‌లు పెట్టాడు. తాను చెప్పిన‌ట్టుగా న‌డుచుకోవాల‌ని వారిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం యువ‌తిని బెల్ట్‌తో చిత‌క‌బాదాడు. ఇది చూసి యువ‌తి త‌ల్లి త‌ట్టుకోలేక‌పోయింది. చివ‌ర‌కు అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ల్లీ, కూతురు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు