Andhra Pradesh: మరో మహిళతో చనువుగా ఉన్న తండ్రి.. బంధువుల ముందు హేళన.. కొడుకు ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

కొద్దిరోజులుగా మల్లికార్జునరావు ఓ మహిళతో చనువుగా ఉండటం కొడుకు సాయికృష్ణ గమనించాడు. ఆమె కోసం డబ్బులు ఖర్చు చేయడం అతని నచ్చలేదు. మరోవైపు విదేశాల్లో చదువుకున్న సాయి.. ఇక్కడ సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు.

  • Share this:
    తండ్రి మరో మహిళతో చనువుగా ఉండటం చూసిన కొడుకు కోపం పెంచుకున్నాడు. ఆస్తి తనకు దక్కదని ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే తండ్రిని హత్య చేయించాడు. అయితే ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జునరావు.. జీవినోపాధి కోసం నరసరావుపేట టౌన్ రామిరెడ్డిపేటకు వచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఏడాది క్రితం తనను మోసం చేశాడనే నెపంతో తడికమళ్ల రమేష్‌ని మల్లికార్జునరావు, అతని కొడుకు సాయికృష్ణ, డ్రైవర్‌ కలిసి హత్య చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వీరు.. ముగ్గురు బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే కొద్దిరోజులుగా మల్లికార్జునరావు ఓ మహిళతో చనువుగా ఉండటం కొడుకు సాయికృష్ణ గమనించాడు. ఆమె కోసం డబ్బులు ఖర్చు చేయడం అతని నచ్చలేదు. ఆమె మాయలో పడి తండ్రి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని కోపం పెంచుకున్నాడు. మరోవైపు విదేశాల్లో చదువుకున్న సాయి.. ఇక్కడ సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు. ఇందుకు మల్లికార్జునరావు ఒప్పుకోలేదు. పైగా బంధువుల ముందు హేళనగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే తండ్రిని అడ్డు తొలగించుకోవాలని సాయి భావించాడు. స్నేహితుడు అనిల్‌తో హత్యకు ప్లాన్ వేశాడు.

    రొంపిచర్ల మండలం మునమాకకు చెందిన ఈదర రాజారెడ్డిని సంప్రదించి, రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం రాజారెడ్డి తన అనుచరులైన చినిశెట్టి దుర్గాప్రసాద్, మున్నంగి గోపీ, వేల్పూరి నాగబ్రహ్మచారి, యక్కంటి అంజరెడ్డి, నార్నే శ్రీనులతో చెప్పి వారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నాడు. దీంతో వారు కొద్దిరోజులుగా మలికార్జునరావు కదికలను గమనించారు. జూలై 7వ తేదీన గాయత్రీనగర్‌ వెంచర్‌ వద్దకు వెళ్లిన మల్లికార్జునరావును హత్య చేశారు.

    ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మలికార్జునరావు కొడుకు సాయికృష్ణ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. అనంతరం సాయికృష్ణ, అనిల్‌తోపాటుగా మిగిలిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. హత్య కుట్రలో భాగం పంచుకున్న ఈదర రాజారెడ్డి, సాహిద్‌ నాగూర్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు.
    Published by:Sumanth Kanukula
    First published: