అమరావతి భూముల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. CRDA పరిధిలోని 1,402 ఎకరాలను... 50,793 మంది మహిళలకు ప్రభుత్వం.. ఇళ్ల పట్టాలుగా ఇవాళ ఇవ్వనుంది. అలాగే.. CRDA ప్రాంతంలో.. రూ.443 కోట్లతో నిర్మించిన 5,024 టిట్కో ఇళ్లను కూడా ప్రభుత్వం ఇవాళ లబ్దిదారులకు ఇవ్వనుంది. ఇందుకోసం గుంటూరు జిల్లా.. తుళ్లూరు మండలం.. వెంకటపాలెంలో ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనందంగా ప్రారంభించబోతున్నారు.
ఈ భూముల పంపిణీ అంశంపై పెద్ద దుమారమే రేగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు.. రాజధాని నిర్మాణం కోసం ఈ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. ఐతే... వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దాంతో... అమరావతిలో రాజధాని నిర్మాణం ఆగిపోయింది. ఐతే.. అమరావతిలో శాసన రాజధానిని నిర్మిస్తున్నామంటున్న ప్రభుత్వం.. అందుకు.. వేల ఎకరాల భూములు అవసరం లేదని చెబుతోంది. అందువల్ల ఆ భూములను పేదలకు పంచడం సరైన నిర్ణయంగా భావించింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, అమరావతి రైతులు వ్యతిరేకించారు. కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఐతే.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అందువల్ల ప్రభుత్వం ఇవాళ భూముల పంపిణీకి సిద్ధమైంది. 50,793 మందికి ఒక సెంట్ చొప్పున పంపిణీ చేయనుంది.
టిట్కో ఇళ్లు :
రాష్ట్రవ్యాప్తంగా... 1,43,600 మంది లబ్దిదారులకు ప్రభుత్వం 300 చదరపు అడుగుల టిట్కో ఇళ్లను 1 రూపాయికే ఇస్తూ... ఇవాళ హక్కు పత్రాలను ఇస్తుంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా లబ్దిదారులకు రూ.9,406 కోట్ల వరకూ లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.
రైతుల నిరసనలు :
లబ్దిదారులకు సెంటు చొప్పున ప్రభుత్వం భూములు పంచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. అటు అమరావతిలో భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా నల్ల కండువాలు, నల్ల రిబ్బన్లు, నల్ల బెలూన్లతో నిరసనలు తెలుపుతామని ప్రకటించారు. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైఎస్ జగన్... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక... ఎందుకు మాట మార్చారని వారు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.