హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ఆశాజనకంగా ఆర్థిక ప్రగతి.. ఆదాయ మార్గాలు పెచ్చడంపై శ్రద్ధ పెట్టాలన్న సీఎం జగన్

CM Jagan: ఆశాజనకంగా ఆర్థిక ప్రగతి.. ఆదాయ మార్గాలు పెచ్చడంపై శ్రద్ధ పెట్టాలన్న సీఎం జగన్

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా పరుగులు పెట్టించే దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. పారదర్శక విధానాలు, నిబంధనలు, కచ్చితంగా అమలు చేయడంపై ఫోకస్ చేయాలని సూచించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వ పెద్దలే పదే పదే ఈ మాట చెబుతున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులో ఉందని సహకరించాలని ఉద్యోగులను కోరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మాత్రం సంక్షేమాన్ని వీడడం లేదు. క్రమం తప్పకుండా నవరత్నాలు (Navarathnalu) అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు (Welfare Schemes) విడతల వారిగా నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు.  ఇప్పుడు ఆదాయం పెంచే మార్గాలపై ఫోకస్ చేస్తున్నారు సీఎం జగన్. ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు.

  తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందన్నారు.. జీఎస్‌టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

  అయితే పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంతో ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులకు స్పష్టం చేశారు.

  సెప్టెంబరు 2022 వరకూ లక్ష్యం 27,445 కోట్లు రూపాయలు కాగా, 25,928 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. అలాగే 94.47 శాతం లక్ష్యం చేరుకున్నామని చెప్పారు. ఈ కాలంలో దేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపీలో 28.79శాతంగా ఉందని పేర్కొన్నారు.

  ఇదీ చదవండి : ఆ గ్రామం నుంచి రజకుల బహిష్కరణ.. ఇతర కులాల సహాయ నిరాకరణకు ఇదే కారణం

  ఈ సందర్భంగా లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ట్యాక్స్‌ ఇన్ఫర్మేషన్‌, ఇన్వెస్టిమెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి పరిచామన్నారు. హెచ్‌ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. పన్నుచెల్లింపు దారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలి. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని చేయాలన్నారు.

  ఇదీ చదవండి : నేరుగా భక్తులకే స్వామి సేవ చేసే అవకాశం.. ఈ నెల 11 నుండి శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు..

  గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలి. బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలి. ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి. నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులో తీసుకు రావాలన్నారు. అక్రమ మద్యం తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో ఐఏఎస్‌ అధికారులు కృష్ణబాబు, రజత్‌ భార్గవ, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, గుల్జార్‌లను సభ్యులుగా పెట్టాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు దఖలు పడతాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగం అన్నదానిపై అవగాహన కల్పించాలని సూచించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News

  ఉత్తమ కథలు