• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • GUNTUR ANDHRA PRADESH GOVERNMENT ANNOUNCE RS 5 LAKHS COMPENSATION TO TADEPALLI GANG RAPE VICTIM AND POLICE INVESTIGATION IS GOING ON FULL DETAILS HERE PRN GNT

Tadepalli Gang Rape Case: తాడేపల్లి ఘటన వెనుక సంచలన నిజాలు... సీఎం జగన్ ఏమన్నారంటే...!

ప్రతీకాత్మక చిత్రం

Gang Rape: తాడేపల్లి పుష్కరఘాట్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది.

  • Share this:
    Anna Raghu, Guntur Correspondent, News18

    తాడేపల్లి పుష్కరఘాట్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, ఇతర అనుమానితులను విచారిస్తున్నారు. ఇది కచ్చితంగా బ్లేడ్ బ్యాచ్ పనేని భావిస్తున్న పోలీసులు... విజయవాడలో జల్లెడపడుతున్నారు. ఇప్పటికే ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని బాధితురాలికి కాబోయే భర్త గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. బాధితురాలికి కాబోయే భర్తను కూడా విచారించి అతని పాత్ర ఏమీ లేదని తేల్చినట్లు సమాచారం.

    అసలేం జరిగిందంటే..!
    విజయవాడకు చెందిన బాధిత యువతి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఇటీవలే ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి విధులు ముగించుకొని అతడితో కలిసి సీతానగరం పుష్కరఘాట్ కు వెళ్లింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. వీళ్లిద్దరినీ గమనించిన ఇద్దరు యువకులు... వారిపై వెనుక నుంచి దాడి చేశారు. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి... యువతిపై అత్యాతారం చేశారు. యువకుడు ఎదురుతిరగకుండా బ్లేడుతో బెదిరించారు. అనంతరం చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని ఓ నాటుపడవలో అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితులు స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. నిందితులను త్వరలోనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు.

    ఇది చదవండి: వీళ్లు దండుపాళ్యం బ్యాచ్ కంటే దారుణం... మర్డర్ చేస్తే చిన్న డౌట్ కూడా రాదు..!


    మరోవైపు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై అధికారులను ఆరాతీసిన ఆయన.. హోంమంత్రి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను జీజీహెచ్ కు పంపారు. ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన మంత్రులు.. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారన్నారు.

    ఇది చదవండి: 30 మందికి ఫస్ట్ డోస్ కొవిషీల్డ్.. సెకండ్ డోస్ కొవాగ్జిన్... వారి పరిస్థితి ఎలా ఉందంటే..!

    యువతిపై సామూహిక అత్యాచారం అత్యంత హేయమైన చర్య అని.. మహిళల భద్రత కోసం అనేక చట్టాలున్నా ఉన్మాదులు రెచ్చిపోతున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. మహిళా భద్రత కోసం రూ.33 కోట్లు కేటాయించారని.. మూడు ఎఫ్ఎస్ఎల్ ల్యాబులు ఏర్పాటు చేశామన్నారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువైందన్న సమాచారముందని.. అందుకే నిఘా పెంచినట్లు సుచరిత వివరించారు.

    ఇది చదవండి: ఆనందయ్య మందుకు బ్రేక్..? హైకోర్టులో ప్రభుత్వం ఏం చెప్పిందంటే..!

    Published by:Purna Chandra
    First published: