హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime New: ప్రేమతో దగ్గరకు వెళ్లాడు.. బ్లేడుతో మర్మాంగం కోసిన ప్రియురాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

Crime New: ప్రేమతో దగ్గరకు వెళ్లాడు.. బ్లేడుతో మర్మాంగం కోసిన ప్రియురాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

ప్రియుడి మర్మాంగం కోసిన ప్రియురాలు

ప్రియుడి మర్మాంగం కోసిన ప్రియురాలు

Woman attacked her lover: రోజు రోజుకు అమ్మాయిలు సైతం ఉన్మాదులుగా మారుతున్నారు. కారణం ఏదైనా కావొచ్చు.. కిరాతకానికి పాల్పడుతున్నారు. అయితే వీటిన్నటికీ ప్రధాన కారణం.. అక్రమసంబంధాలే కావడం కలవర పెడుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Prakasam, India

  Woman attacked her lover: తెలుగు రాష్ట్రాల్లో ఉన్మాధుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఒకప్పుడు మగవాళ్లే ఉన్మాధులుగా మారేవారు.. హత్యలకు.. హత్యా యత్నాలకు తెగపడేవారు.. ఇప్పటికీ బరి తెగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అదే దారిలో వెళ్తున్నారు. అయితే అందుకు కారణాలు ఏవైనా.. హత్యలు చేయడనికి.. రక్తపాతానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఇలాంటి వాటికి ఎక్కువగా అక్రమ సంబంధాలే (Extramarital Affair) కారణం అవుతున్నాయి. పెళ్లైన మహిళలు అయితే ఇలా ప్రియుడి (Lover) మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న ఘటనలు తరచూ వింటున్నారు. కొంతమంది అయితే మరీ దారుణంగా..? కన్న పిల్లలను సైతం హత్యలు చేయడానికి వెనుకాడడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ (Andrha Praesh) లోని ప్రకాశం జిల్లా (Prakasam District) లో ఓ దారుణం చోటుచేసుకుంది.

  ఓ మహిళ అయితే తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసింది. ఈ షాకింగ్ ఘటన జిల్లాలోని కొండపి మండలం మూగచింతల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మూగచింతలకు చెందిన సీహెచ్‌ హరినారాయణకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో చాలా కాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరి ఎప్పుడు హ్యాపీగానే ఉండేవారు. ఆమె కూడా అదే స్థాయిలో ఆమెను ఇష్టపడింది..

  దీంతో ఎప్పటిలాగే ఆమె ప్రియుడు.. మహిళ ఇంటికి బుధవారం రాత్రి వెళ్లాడు. ఎప్పటిలానే కాసేపు సన్నిహితంగా ఉన్నాడు. కానీ ఆమె.. ముందస్తు పథకం ప్రకారం తాను తెచ్చుకున్న బ్లేడుతో అతడిపై దాడి చేసింది. ఏం జరుగుతోందో తెలిసే లోపే.. ఒక్క క్షణంలోనే ప్రియుడి మర్మాంగాన్ని కోసేసి.. అక్కడినుంచి పరారైంది.

  ఇదీ చదవండి : తిరుమలలో అన్న ప్రసాద వితరణ ఎప్పుడు ప్రారంభమైంది? అన్నదాన ట్రస్టుల్లో ఎన్ని కోట్లు ఉన్నాయి..?

  ఆ బాధ తట్టుకోలేక.. బాధిత వ్యక్తి హరినారాయణ లబోదిబో అంటూ.. సాయం కోసం బయటకు పరుగులు తీశాడు. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని ఒంగోలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా హరినారాయణకు భార్య లేకపోవడంతో చాలా కాలం నుంచి ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు సన్నిహితంగా సాగిన వీరి బంధం ఇలా మారడానికి ప్రధాన కారణం.. ఆర్ధిక సబంధాలే అంటున్నారు.

  ఇదీ చదవండి : ఆ లెక్చరర్ చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే.. చైతన్య కాలేజ్ భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు

  వీరిద్దరి మధ్య ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిటిందని.. అందుకే ఆమె ఇలా బ్లేడ్ తో దాడి చేసింది అంటున్నారు. అంటే ఆమె అడిగిన డబ్బులు ఇస్తానని.. అతడు తప్పించుకుని తిరుగుతున్నాడనే.. ఇలా చేసింది అంటున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Extra marital affair, Prakasam

  ఉత్తమ కథలు