GUNTUR ANDHRA PRADESH CRIME NEWS RECENTLY MARRIED WIFE CHEATED HER HUSBAND IN GUNTUR NGS NJ GNT
AP Crime News: పెళ్లి చేసుకుంది.. తల్లిదండ్రులు కష్టాల్లో ఉందని చెప్పి పుట్టింటికి వెళ్లింది.. విషయం తెలిసి షాకైన పెళ్లికొడుకు..
పెళ్లిపేరుతో టోకరా చేసిన యువతి
AP Crime News: ఒక అబ్బాయి పెళ్లి పేరుతో మోసం చేశాడని వార్తలు వింటుంటాం.. ఇప్పుడు ట్రెండ్ మారింది. తాజాగా పెళ్లి పేరుతో యువతి టోకరా వేసిందని.. పోలీసులను ఆశ్రయించాడు ఓ యువకుడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Andhra Pradesh Crime News: సాధారణంగా ఒక అబ్బాయి పెళ్లి పేరుతో మోసం (Marriage Cheating) చేశాడని వార్తలు తరచూ వింటుంటాం.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. రివర్స్ కేసులు సైతం నమోదు అవుతున్నాయి. ఇటీవల యువతులు మోసం చేస్తున్నారంటూ.. పోలీసులను ఆశ్రయించిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) లో జరిగింది. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు బీటెక్ చదివి.. ప్రస్తుతం మోటో కంట్రోలర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి పోలియోతో, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్లకు శ్రీనివాసరావు ఒక్కడే కొడుకు. రెవిన్యూ డిపార్ట్మెంట్ (Revenue) లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ద్వారా ఓ పెళ్లిసంబంధం వచ్చింది. ఇరువురికి నచ్చడంతో పెళ్లి పీటలెక్కారు.
అదే జిల్లాకు చెందిన వీఆర్వో శ్రీలక్ష్మీ కుమార్తె ప్రియతో శంకర్‌కు ఈ ఏడాది పిబ్రవరిలో వివాహం అయ్యింది. అమ్మాయికి తండ్రిలేరని కానీ కట్నం కూడా తీసుకోకుండా పెళ్లిచేసుకున్నాడు శ్రీనివాసరావు. పెళ్లి టైంలో ఉన్నదాంట్లోనే అమ్మాయికి రెండు లక్షలు పెట్టి బంగారం కూడా చేయించాడు. గ్రాండ్‌గా రూ.6లక్షలతో ఊర్లోనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా వధువరుల జంట చూడముచ్చటగా ఉందని ఆశీర్వదించి వెళ్లారు.
అత్తారింట్లో అడుగుపెట్టని కోడలు ఏమయిందో ఏమో తెలియదు కానీ... రిసెప్షన్ అయిన వెంటనే వీఆర్వో శ్రీలక్ష్మీ తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లినట్లు సమాచారం. తొలి రాత్రి నుంచి యువతి తనను దూరంపెట్టిందని… ఒక్క రోజు కూడా కాపురం చేయలేదని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెలల తరబడి ఆమె పుట్టింటి నుంచి రాకపోవడంతో.. పెద్దలు వెళ్లి అడిగితే గుంటూరులో ఇల్లు అద్దెకి తీసుకోమన్నారు. వాళ్లు కోరినట్లే గుంటూరులో ఇల్లు తీసుకుంటే.. అక్కడ కూడా ఆ యువతి ఒకరోజు ఉండి తనను తాకవద్దంటూ రెండో రోజు పుట్టింటికి వెళ్లిపోయిందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు.
యువతికి గతంలోనే పెళ్లి అయ్యింది..! గట్టిగా నిలదీయడంతో కట్నం ఇవ్వమంటున్నారని తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారని శ్రీనివాసరావు వాపోతున్నాడు. అంతేకాకుండా రూ. 10 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అసలు వీళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారని వాకబు చేయగా.. ఆ అమ్మాయికి గతంలోనే పెళ్లి అయినట్లు తెలిసిందన్నారు.
ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు గత ఏడాది శ్రీలక్ష్మీ వీఆర్వోగా పనిచేస్తున్న ఊరిలోనే ఓ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగితో యువతికి నిశ్చితార్థం చేశారని తెలిసిందంటున్నారు శ్రీనివాసరావు. ఆ విషయం దాచిపెట్టి తనతో వివాహం అంటూ.. తతంగం నడిపారని ఆవేదన చెందుతున్నాడు. మరొకరితో పెళ్లి తంతు నడుపుతూ తనను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నాడు. తనను మోసం చేసిన తల్లీ కూతుళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు.
ఈ ఆరోపణలను ప్రియ తీవ్రంగా ఖండిస్తోంది. ఇఫ్పటికే శ్రీనివాసరావుపై అమరావతి పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది అంటున్నారు. అతడు తనను మాయమాటలతో మోసం చేశాడని ఆరోపిస్తోంది. లక్షల్లో జీతం.. మంచి ఉద్యోగం అని చెప్పాడని.. అలాగే వయసు కూడా తమ దగ్గర దాచి మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేసు నమోదైందని అన్ని వివరాలు పోలీసుల విచారణలోనే తెలుస్తాయి అంటోంది. తనను మోసం చేసి.. తిరిగి మోసపోయినట్టు శ్రీనివాస్ డ్రామాలు ఆడుతున్నాడని ఆమె ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.