హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cheating Husband: 11 మంది కాదు.. అంతకుమించే? నిత్య పెళ్లికొడుకు కేసులో నమ్మలేని నిజాలు ఎన్నో?

Cheating Husband: 11 మంది కాదు.. అంతకుమించే? నిత్య పెళ్లికొడుకు కేసులో నమ్మలేని నిజాలు ఎన్నో?

వెలుగులోకి నిత్య పెళ్లికొడుకు లీలలు

వెలుగులోకి నిత్య పెళ్లికొడుకు లీలలు

Cheating Husband: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నిత్య పెళ్లికొడుకు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు శివ శంకర్ 11 మందిని పెళ్లి చేసుకున్నాడనే ప్రచారం జరిగింది.. కానీ అతడి వలలో మరింతమంది ఉన్నారన్న తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  Cheating Husband: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ల్లో పెను సంచలనంగా మారింది నిత్య పెళ్లికొడుకు వ్యవహారం. సాధారణంగా ఈ రోజుల్లో ఒక్క భార్యను మెయింటెన్ చేయడమే చాలా కష్టం.. అలాంటింది ఒకటా రెండా.. ఏకంగా 11 మందిని పెళ్లాడాడు. వీడెవండండ్రా బాబు అంటూ అంతా షాక్ కు గురయ్యారు. అది కూడా ఏడుగురి బార్యలను ఒకే ఏరియాలో ఉంచాడు.. అది కూడా పక్క పక్క వీధుల్లోనే వారితో కాపురం పెట్టాడు.. కేవలం నాలుగేళ్లలో 11 పెళ్లిళ్లు చేసుకుని.. వేర్వేరు కాపురాలు పెట్టాడు.. కానీ ఎవరికీ అనుమానం రాకుండా భలే మేనేజ్ చేస్తూ వచ్చాడు. పక్క పక్క వీధుల్లోనే భార్యలు ఉన్నా.. ఎవరికీ అనుమానం రాకుండా మాస్టర్ బ్రయిన్ వాడాడు.. నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో రెండో పెళ్లి చేసుకుంటేనే ఈజీగా తెలిసిపోతుంది. అలాంటింది పదకొండు మందిని ఎలా పెళ్లాడాడో.. అది కూడా పక్క పక్క వీధుల్లో ఎలా కాపురాలు పెట్టాడో. ఇన్నాళ్లు ఎవరికంటా పడకుండా ఎలా తప్పించుకున్నాడో.. అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ నిత్య పెళ్లికొడుకు విషయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం అతడికి ఉన్నది 11 మంది భార్యలు కాదని.. మరికొంతమంది అతడి బాధితులు ఉన్నారని ఆరోపనలు వినిపిస్తున్నాయి.

  నిత్య పెళ్లికొడుకు శివశంకర్‌ (Shivashankar) కేసు విచారణలో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శివశంకర్‌ బాధితులు పదకొండు మంది కాదు ఇంకా ఎక్కువే ఉన్నారన్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. ఇద్దరు మహిళలు ఆరోపణలు చేసిన మరుసటి రోజే, శివశంకర్‌ రియాక్టవడంతో ఈ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాను 11మందిని పెళ్లి చేసుకుని మోసం చేసుంటే ఇద్దరే ఎందుకు బయటికి వచ్చారు? మిగతవాళ్లెక్కడ? అంటూ లాజిక్‌ లాగడంతో, బాధితురాలు మరోసారి ఫైర్ అయ్యారు. 

  తాజాగా బంధువులు, మహిళా సంఘాలతో కలిసి రామచంద్రాపురం (Ramachandrapuram) పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. శివశంకర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. తాను గుంటూరు (Guntur) లోనే ఉన్నానని చెబుతున్నా పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అతడు 11 మందినే కాదు మరికొందరు కూడా అతడి వలలో చిక్కుకున్నారని ఆరోపిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు.

  ఇదీ చదవండి : ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం.. పథకాలకు నిధుల విడుదల నేడే

  అలాగే శివశంకర్‌ మోసాలకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయి ఆ మహిళ ఆరోపిస్తోంది. శివ శంకర్ మొత్తం 11 మందిని పెళ్లిళ్లు చేసుకున్నాడు. దానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయిని.. అయితే మిగతావాళ్లు పరువు పోతుందనే బయటికి రావడం లేదన్నారు. తమలాగే మరో అమ్మాయి మోసం పోకూడదనే తాను బయటికు వచ్చాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పరువును కూడా పక్కనబెట్టి ముందుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే, ఎందుకు నిందితుడిని అరెస్ట్‌ చేయలేదని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

  ఇదీ చదవండి : ఏపీ రాజకీయాల్లో లెక్కలు మారుతున్నాయా? రఘురామకు జనసేన స్నేహహస్తం.. ఇదే లెక్క

  గుంటూరు జిల్లా బేతపూడికి చెందిన శివశంకర్‌ వ్యవహారంలో రోజుకూ ట్విస్ట్ వస్తున్నా పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలు రేకేత్తుతున్నాయి. అతడికి 2018లోనే పెళ్లయిందని, ఈ విషయాన్ని దాచి మ్యాట్రిమోని సైట్లలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పరిచయం చేసుకున్నాడు. విడాకులు తీసుకుని, అందంగా ఉండే యువతులను ఎంచుకుంటాడు. ఇలా కొండాపూర్‌లో తమతోపాటు.. మరో యువతితో కాపురాలు పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే దగ్గర వేర్వేరుగా 25 లక్షల చొప్పున నగదు, .7 లక్షలు విలువ చేసే బంగారం తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు.

  ఇదీ చదవండి : 9 జిల్లాల్లో పబ్లిక్ పల్స్ పై క్లారిటీ.. మరో ఎన్నికల సమరానికి సై అంటున్న సీఎం జగన్

  ఈ కేసును పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శివశంకర్ పై కేపీహెచ్‌బీ, రామచంద్రపురం, గచ్చిబౌలి, మాదాపూర్‌, బాలానగర్‌, ఎల్బీనగర్‌, ఏపీలోని గుంటూరు, అనంతపురం, మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur, Husband

  ఉత్తమ కథలు