Home /News /andhra-pradesh /

GUNTUR ANDHRA PRADESH CRIME NEWS MARRIED WOMEN CHEATED BY ONE PRIEST IN NTR DISTRICT NGS GNT

Crime News: భర్తను బతికిస్తానని సోది చెప్పిన వ్యక్తి వలలో పడ్డ మహిళ.. చివరకు ఏం జరిగిందంటే?

మహిళను మోసం చేసిన సోది చెప్పే వ్యక్తి

మహిళను మోసం చేసిన సోది చెప్పే వ్యక్తి

Crime News: మోసం చేయడానికి కొత్త కొత్త దార్లు వెతుకున్నారు కొందరు కేటుగాళ్లు.. అమాయకులకు మాయ మాటలు చెప్పి.. ఈజీగా బుట్టలో పడేస్తున్నారు.. తాజాగా ఓ మహిళకు సోది చెబుతానంటూ వచ్చిన వ్యక్తి బుట్టలో వేసుకుని.. మోసం చేశాడు. చివరికి ఏం జరిగింది అంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోజు రోజుకూ కేటుగాళ్ల సంఖ్య పెరుగుతోంది. కొత్త మార్గాల్లో అమాయకులను నట్టేట ముంచుతున్నారు. కొందరు కొత్త టెక్నాలజీ వాడి లక్షలు దోచేస్తున్నారు. ఆన్ లైన్ యాప్ లు (Online Apps).. అనవసర లింకులు.. సోషల్ మీడియా చాటింగ్ (Social Media Chatting) లు.. ఇలా వివిధ రకాల పేర్లతో మోసం చేస్తూ ఉన్నారు. అందుకే రోజు రోజు కు సైబర్ నేరాల (Cyber Crime) సంఖ్య పెరుగుతోంది. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా సైబర్ వలకు చిక్కుతూనే ఉన్నారు అమాయకులు.. అయితే ఏ టెక్నాలజీ వాడకుండానే.. ముఖం పరిచయం లేకుండానే.. మాటలతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకపు వ్యక్తులను ఎంచుకుని.. వారి అవసరాలను గుర్తించి.. మాయమాటలు చెబుతూ బుట్టలో వేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా (NTR District) , జగ్గయ్యపేటనియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలోని తోటచర్ల గ్రామంలో సోది చెబుతాను అంటూ ఓ వ్యక్తి మాయమాటలు నమ్మిన.. వివాహిత ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది..

    తోటచర్ల గ్రామానికి చెందిన సుధాకర్, వెంకటరమ దంపతులు ఉన్నారు. అయితే కొన్ని రోజులు క్రితం అనారోగ్యం సుధాకర్ మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకున్న సోది చెప్పుకుంటూ బతికే ఓ వ్యక్తి.. ఆ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఆ మహిళ ఇంటికి వెళ్లి.. ఆమెకు నాగ దోషం ఉందని.. ఆ కారణంతోనే భర్త అకారణంగా మరణించాడని నమ్మించాడు..



    అతడి మాటలు నమ్మిన ఆమె.. ఆ దోషం పోతుందా అంటూ అడిగింది. కొన్ని పరిహారాలు చేస్తే దోషం పోవడం కాదు.. తన భర్త కూడా తిరిగి బతికి వస్తాడంటూ నమ్మించాడు.. అసలు మనిషి వస్తాడు అంటేనే నమ్మశక్యం కాదు.. కానీ ఆ సోది చెప్పే వ్యక్తి మాత్రం.. ఎవేవో ఉదహరణలు చెప్పి ఆ మహిళను నమ్మించాడు. అయితే ఆమె భర్తను బతికించడానికి.. తమ గురువుగారు పూజలు చేస్తారని.. ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు.

    ఇదీ చదవండి : ఢిల్లీలో బాబు వంగి వంగి దండాలు పెట్టారంటూ ట్వీట్.. సైబర్ సెల్ కు ఫిర్యాదు.. ఎందుకంటే?

    గురువు చెప్పాడంటూ ఆ వ్యక్తి వచ్చి ఒక యంత్రం ఇంటిలో పెట్టాడు. తన భర్తను ఎలాగైనా బతికించాలని ఆమె కోరింది. దీన్ని అదునుగా తీసుకున్న ఆ వ్యక్తి దోష పరిహారం కోసం పూజలు, హోమాలు చేయాలని చెప్పాడు. మొదట 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని మూడు సార్లు పూజలు నిర్వహించాలని.. ఒకసారి 5 వేలు, మరోసారి 15 వేలు, మరోసారి 3 వేల రూపాయలు కట్టించుకున్నాడు. ఇలా ఆమెదగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు తప్పా.. పూజలు ఏమీ చేయడం లేదని ఆమెకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో గ్రామస్థుల ఆ గురువు, శిష్యులను బంధించి.. పోలీసులకు అప్పగించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Vijayawada

    తదుపరి వార్తలు