హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: శ్మశానాన్ని కేరాఫ్ గా మార్చుకున్న దొంగ.. ఫోన్ సహా ఎలక్ట్రానిక్ వస్తువులే వాడడు

Crime News: శ్మశానాన్ని కేరాఫ్ గా మార్చుకున్న దొంగ.. ఫోన్ సహా ఎలక్ట్రానిక్ వస్తువులే వాడడు

శ్మశానాన్ని కేరాఫ్ గా చేసుకున్న దొంగ

శ్మశానాన్ని కేరాఫ్ గా చేసుకున్న దొంగ

Crime News: ఈ దొంగ తెలివితేటలు మామూలుగా లేవు.. రెక్కీ వేస్తాడు.. పక్కాగా ప్లాన్ చేసి దోచేస్తాడు.. కానీ అతడికి ఇళ్లు లేదు.. సెల్ ఫోన్ సహా ఏ ఎలక్ట్రానిక్ వస్తువూ వాడడు.. విచారణలో సంచలన విషయాలు..

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Crime News: వీడి తెలివితేటలు మామూలుగా లేవు.. దొంగతనాలు చేయడంలో ఆరి తేరాడు.. తప్పించుకోవడంలో కూడా వీడి తెలివి చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే

  సహజంగా దొంగలు దొంగతనం..  చేసి దోచుకున్న సొమ్మును డబ్బురూపంగా మర్చి.. వాళ్ల ఇంట్లోనూ లేదంటే లేదా తెలిసిన వారి దగ్గరో దాచుకుంటారు. కానీ ఇతడి రూటే సపరేట్ .. అంతేకాదు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేని వారు ఎవరుంటారు.. కానీ ఇతడు మొబైల్ (Mobile) వాడాడు.. అదే కాదు ఏ ఎలక్ట్రానిక్ గూడ్ (Electronic  Goods) కూడా తన దగ్గర ఉంచుకోడు.. అవి ఉంటే సాక్ష్యాలు అవుతాయనే భయంతో.. వాటి జోలికి వెళ్లడు.. అందుకు కారణం పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడడమే..

  అంతేకాదు.. అతడికి ఇళ్లు కూడా లేదు. స్నేహితులు, బంధువులను కూడా మెయింటెన్ చేయడు.. పోలీసులకు దొరికేందుకు చిన్న క్లూ కూడా వదలడు.. శ్మశానాన్నే తన ఇళ్లుగా మార్చుకున్నాడు. నిత్యం అక్కడే ఉంటాడు సమాధులే అతని బెడ్ లు అక్కడే తింటాడు అక్కడే నిద్ర పోతాడు.. 

  ఇక అక్కడ నుంచే  రెక్కీ నిర్వహిస్తాడు.. తరువాత పక్కా ప్లానింగ్ తో దొంగతనం చేస్తాడు.  తరువాత పక్కా ప్లానింగ్ తో ఆ ఇంటికి చేరుకుంటాడు.. దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలను ముందే గుర్తించి.. తన ఆనావాళ్లు చిక్కకుండా గ్లౌజులు వేసుకుని.. ముందు సీసీ కెమెరానలు ధ్వంసం చేస్తాడు.. వాటి వైర్లు కట్ చేస్తాడు.. ఆ తరువాత పని కానిచ్చేస్తాడు.   

  ఇదీ చదవండి : వాట్‌ యాన్‌ ఐడియా..! బుల్లెట్‌ బార్బిక్యూ.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే..?

  ఎక్కవగా తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తాడు.  దొంగతనాలకు పాల్పడతాడు సొత్తును స్మశానాల్లో పాతిపెట్టి దాచేస్తాడు రెండు రాష్ట్రాల్లో ఈ తరహాలో దాదాపుగా 121 చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని చల్లపల్లి సిసిఎస్ పోలీసుల అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జాషువా వివరాలు వెల్లడించారు.

  ఇదీ చదవండి : నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్

  గ్రామానికి చెందిన తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య చోరీని వృత్తిగా చేసుకున్నాడు తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలు చేస్తాడు . ఇతనపై ప్రస్తుతం ఏలూరు జిల్లా చట్రాయి మండలం పోలీస్ స్టేషన్లో డిసి షీట్ ఉంది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చాలాచోట్ల చేతివాటం ప్రదర్శించాడు. గత నెల 28న  ఇస్లాం నగర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సూర్యను అదుపులకు తీసుకొని విచారించడంతో మరికొన్ని నేరాలు వెలుగులోకి వచ్చాయి .

  ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు.. ఎందుకంటే..

  ఈ కేసులో సూర్యను పిడిఎఫ్ ఫై తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోగా వరంగల్ జైల్లో శిక్ష అనుభవించాడు. గత నెల 17న విడుదల తర్వాత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో చోరికి పాల్పడ్డాడు.

  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు