Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
Cheating: స్మార్ట్ ఫోన్ (Smart Phone) తో ఎన్ని ప్రయోనాలు ఉన్నాయో.. మోసాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. కొందరు చేసిన చిన్న పొరపాటుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్ ను వాడుతూ.. డబ్బులు ఖర్చు చేస్తున్న పిల్లలు పక్కదారి పడుతున్నారు.. అంతేకాదు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. లేక లక్షల్లో తల్లిదండ్రులకు నష్టాలు తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరుగుతూ ఉన్నాయి. తాజగా గుంటూరు జిల్లా (Guntur District) లో ఓ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫిరంగి పురానికి చెందిన యువతీ గుంటూరు లో ద్వితీయ సంవత్సరం ఇంటర్ మీడియేట్ చదువుతోంది. అప్పుడప్పుడు తన మిత్రులతో మాట్లాడటానికి సామజిక మాధ్యమాలు చూడటానికి తన తండ్రి సెల్ ఫోన్ ఇచ్చేవాడు.
అలా తన తండ్రి సెల్ ఫోన్ వాడుతున్న యువతి.. అతడి యూపీఐ అకౌంట్ లో డబ్బు ఉండటాన్ని గమనించింది. దీంతో తన తండ్రికి తెలియకుండా.. ఆన్ లైన్ లో వాచ్ లు దుస్తులు అలంకరణ వస్తువులు కొనుగోలు చేసింది. సుమారు వాటి విలువ ఎనబై వేల రూపాయలు పైనే ఉంది. అయితే తాను ఖర్చు చేసిన డబ్బును తన తండ్రి గుర్తించేలోపు మల్లి ఎలా ఐయిన సంపాదించి అకౌంట్ లో వెయ్యాలని అనుకుంది.
అంత డబ్బు ఎలా సంపాదించాలో అర్థం కాలేదు. ఫ్రెండ్స్ ని అని అడిగితే.. కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పారు. దీనికోసం కిడ్నీ ఎవరైనా కొంటారేమోనని ఆన్ లైన్ లో వెతికాను. అక్కడ ఆమెకు ఒక ప్రకటన కనిపించింది. అర్జెంట్ గా కిడ్నీ కావాలని.. అమ్మితే ఏడు కోట్ల రూపాయలు ఇస్తామని ఒక సైట్ లో యాడ్ కనిపించింది. అందులో ప్రవీణ్ రాజ్ పేరుతో డాక్టర్ ఫోటో, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్ హాస్పిటల్ పేర్లు ఉన్నాయి. ఫోన్ చేస్తే ప్రవీణ్ రాజ్ మాట్లాడాడు.
ఇదీ చదవండి : రాజకీయంగా చంద్రబాబు పనైపోయిందా? ప్రత్యర్థులు తక్కువ అంచనా వేస్తున్నారా..?
మొదట సగం డబ్బులు ఆ తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పాడు. దానికి అతను చెప్పిన టెస్టులు చేయించుకోమన్నాడు. అన్నీ చేయించి రిపోర్టులు అతనికి పంపారు. అది చూసిన అతను ఓకే కిడ్నీ ఇవ్వచ్చు అని చెప్పాడు. అయితే మొదటి విడతగా 3.50 కోట్లు వేస్తామని.. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగితే, తనకు అకౌంట్ లేకపోవటంతో.. తన తండ్రి డిటైయిల్స్ ఇచ్చింది.
ఆ అకౌంట్ కు మూడున్నర కోట్లు జమ అయినట్లు స్క్రీన్ షాట్ తీసి వాట్స్అప్ చేశాడు. అయితే తాను బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేస్తే బ్యాలెన్స్ కనిపించలేదు. ఇదేమిటని అడిగితే అవి డాలర్ల రూపంలో ఉన్నాయని.. ఇండియన్ కరెన్సీలో కి మారాలంటే టాక్స్ కట్టాలి అని చెప్పినట్టు ఆ యువతి చెబుతోంది. అలా మార్చినుంచి అక్టోబర్ వరకు సుమారు 16 లక్షలు విడతలవారీగా తీసుకున్నా తరువాత.. విసుగు వచ్చి అనుమానంతో అడిగితే ఒక పదివేలు తన్న ఖాతాకు జమ చేశారని.. మిగిలిన మూడున్నర కోట్లు కూడా ఇలాగే జమవుతాయని నమ్మించారు.
ఇదీ చదవండి : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి గంటా.. ఏం చెప్పారంటే..?
చివరికి డబ్బు తిరిగి ఇవ్వాలని గట్టిగా అడుగుతూ మెయిల్ చేస్తే.. ఆమెను ఢిల్లీకి రావాలని చెప్పారు. దీంతో ఆ యువతి విమానంలో ఢిల్లీకి వెళ్లింది. కానీ అక్కడ ఎంతసేపు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదు. తరువాత మళ్లీ ఫోన్ ట్రై చేస్తే.. మరో 1.50లక్షలు జమ చేస్తే నగదు మొత్తం వస్తాయి అని చెప్పాడని.. కానీ అతడు మోసం చేశాడని అర్థమై తిరిగి వచ్చేసినట్టు యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి : వైసీపీ ప్రభుత్వంపై భారీ కుట్ర.. సంచలనంగా మారిన మంత్రి వ్యాఖ్యలు
మరోవైపు కూతురు కనిపించడం లేదంటూ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెతకగా.. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో స్నేహితురాలు వద్ద ఆమె దొరికింది. ఆమెను తండ్రికి అప్పగించారు. ఏ జరిగిందని పోలీసులు ప్రశ్నిస్తే.. అసలు విషయం బయటపడింది. దీంతో ఆ సైబర్ కేటుగాడి గురించి పోలీసులు వెతుకుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur