Ap Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో్ని దారుణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు (CC Camera) పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి. గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో మానభంగాలకు (Gange Rape) పాల్పడుతున్నారు. తరచూ ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భర్త కళ్ల ముందే.. అతడికి కిరతంగా కొట్టి.. అతడి కళ్ల ముందే ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. సినిమాల్లో ఇలాంటి ఘటనలు చూస్తుంటాం.. కానీ నిజంగానే అది జరిగింది. అది కూడా ఎదో నిర్మాణుష్య ప్రాంతంలో కాదు.. రైల్వే స్టేషన్ లో ఈ పాశవిక ఘటన చోటు చేసుకుంది.
బాపట్ల జిల్లాలో (Bapatla district) ఈ కీచక ఘటన చోటు చేసుకుంది. రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని దుండగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు కోసం భార్య భర్తలైన వలస కూలీలు ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్ (Railway Station) లోకి ఎంటరైన ముగ్గురు దుండగుల కన్ను.. అక్కడ ఉన్న మహిళపై పడింది. వెంటనే భర్తను తీవ్రంగా గాయపరిచారు. అతడిని అచేతన స్థితికి చేర్చి.. అతడి కళ్ల ముందే.. అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఇదీ చదవండి : పట్టపగలే షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే తుపాకీతో బెదిరించి బ్యాంకు దోపిడీ
ఈ దారుణం తరువాత తేరుకున్న ఆ కూలీ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు కలిసి అత్యాచారం (Woman gang-raped) చేసినట్లు బాధిత దంపతులు పేర్కొంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి : : అన్నను అంటే చెల్లికి కోపం రాదా? కేటీఆర్ కు షర్మిల కౌంటర్
బాధిత దంపతులిద్దరూ.. ప్రకాశం జిల్లా నుంచి పనుల కోసం రేపల్లి వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికే రాత్రి అవ్వడంతో కాస్త నిర్మాణుష్యంగా ఉంది. కానీ వారు వెళ్లాల్సిన ట్రైన్ కోసం.. వారు రాత్రి రైల్వే స్టేషన్లో వేచి ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు అక్కడి వచ్చారని.. తరువాత తన భర్తను కొట్టి.. ప్లాట్‌ఫాంపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంటోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. బాధితులను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Guntur rape case