Home /News /andhra-pradesh /

GUNTUR ANDHRA PRADESH CRIME NEWS FAKE POLICE CHETING WOMEN AND MORE GIRLS IN GUNTUR NGS GNT

Crime News: సిస్టర్ అంటూ మాట కలుపుతాడు.. ఫోటోలు దిగుతాడు.. తరువాత ఏం చేస్తాడంటే?

చెల్లి అని పలకరిస్తాడు.. ఫోటోలు దిగుతాడు.. చివరికి ఏం చేస్తాడంటే

చెల్లి అని పలకరిస్తాడు.. ఫోటోలు దిగుతాడు.. చివరికి ఏం చేస్తాడంటే

Crime News: వీడు మామూలోడు కాదు.. చేసిది డ్రైవర్ ఉద్యోగం.. కానీ పోలీస్ అని బిల్డప్ ఇస్తాడు.. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాను అంటాడు.. చెల్లి అని పిలుస్తూ ఫోటోలు దిగితాడు.. తరువాత నిజ స్వరూపం బయటపెడతాడు..? ఇంతకీ ఏం జరిగింది అంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India
  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Crime News:  మహిళలకు రోజు రోజుకూ రక్షణ కరువు అవుతోంది. కొత్త కొత్త రూపాల్లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. తెలిసినవాడే కదా అని నమ్మినా.. నట్టేట ముంచేస్తున్నారు. తాజాగా ఓ కేటుగాడి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కలకలం రేపుతోంది. మహిళలను నమ్మించి మోసం చేస్తూ.. కీచకానికి ఒడిగట్టే ఓ నకిలీ పోలీసు (Fake Police) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనని తానను పోలీసులుగా పరిచయం చేసుకుంటూ.. ఏమైనా సాయం కావాలా.. మైహూనా సమస్యల్లో ఉన్నవారికి దగ్గర అవుతాడు.. వారు తనని నమ్మలేదు అనిపించి అనుమానం వస్తే.. చెల్లి అంటూ వరుస కలుపుతాడు..   అచ్చం తన చెల్లిలాగే ఉన్నావంటూ వారితో ఫోటోలు దిగుతాడు. అన్నలాంటోడని నమ్మితే.. తరువాత నట్టేట ముంచుతాడు.  ఇలా తన మాయ మాటలతో ఎంతో మంది మహిళలను మోసం (Cheating Man) చేశాడు.  మరికొంతమందిని ప్రేమ పేరుతో వల వేసి మోసం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి..

  ఈ ప్రబుద్దుడి పేరు మేకల సాయి కుమార్.. ఇంజనీరింగ్ పట్టభద్రుడు కూడా.. ఇతడిది పల్నాడు జిల్లా నర్సారావుపేట.. మొన్నటి వరకు నర్సారావుపేట లోనే ఒక పోలీస్ అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేసేవాడు.  తాను కానిస్టేబుల్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అలా నమ్మించి.. మహిళలను ఈజీ మోసం చేస్తున్నాడు.  మహిళలను వలలో వేసుకొని వారి వంటిపై నగలు దొంగిలించి.. పరారైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ కేటుగాడిపై కేసులు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లేందుకు నర్సారావు పేట లో  బస్సు ఎక్కాడు. అదే బస్సు లో పిడుగురాళ్ల లో ఒక మహిళా హైదరాబాద్ వెళ్లేందుకు ఎక్కింది. ఆ మహిళా తో మాట కలిపాడు మేకల సాయి కుమార్ తాను కానిస్టేబుల్ అని చెప్పుకొని పరిచయం చేసుకున్నాడు.

  ఇదీ చదవండి : విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపే వారి ఖాతాల్లోకి నగదు జమ..

  అక్కడితోనే ఆగలేదు..  మీరు సేమ్ తన సోదరిలా ఉన్నారు అంటూ సెల్ఫీ తీసుకున్నాడు.. అన్న అన్నాడు కదా అని ఆ మహిళ అభ్యంతరం చెప్పలేదు.  తాను ప్రస్తుతం చర్లపల్లిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని తనను ఒక బంగారం రికవరీ కేసులో రికవరీ చేయనందుకు  సస్పెండ్ చేస్తారని  చెప్పి ఆ మహిళను నమ్మించాడు.

  ఇదీ చదవండి: కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ ప్రత్యేక వ్యూహం.. ఏడాది లో పూర్తి చేసే ప్లాన్

  ఎల్బీ నగర్ లో బస్సు దిగిన తరువాత.. ఆ  మహిళతో కలిసి ఆటో ఎక్కాడు. మీ నగలు ఒక సరి ఇస్తే.. మా సార్ కు వీడియో కాల్ చేసుకొని ఇస్తాను.. నా ఉద్యోగం నిలబెట్టిన దాని అవుతావని నమ్మించాడు. అన్నలాంటివాడు అని నమ్మిన ఆ మహిళ  చైన్ ఉంగరం ఇస్తూ.. ఫోన్ మాట్లాడుతూ అక్కడ నుంచి ఉడాయించాడు.

  ఇదీ చదవండి : శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ.. పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

  తాను మోసపోయానని గ్రహించి... ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  మేకల సాయిని  అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా అన్న అని చెప్పి చాలామంది మహిళలను మోసం చేసి.. వారు ఎదురుతిరిగితే వారితో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Gunturu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు