Home /News /andhra-pradesh /

GUNTUR ANDHRA PRADESH CRIME NEWS BEGGAR MUREDER BY THREE YOUNG PERSONS IN GUNTUR BECAUSE HE REFUSE IDLY NGS GNT

AP Crime News: ఇడ్లీ ఇస్తే తీసుకోలేదని అంతపని చేస్తారా..? హత్య కేసులో సంచలన విషయాలు

ఇడ్లీ పార్సిల్ తిరస్కరించాడని హత్య

ఇడ్లీ పార్సిల్ తిరస్కరించాడని హత్య

AP Crime News: యువత ఆవేశం హద్దులు దాటుతోంది. అందులోనూ మద్యం సేవించారంటే అంటే.. విచక్షణ కోల్పోతున్నారు.. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఆ మద్యం మత్తులో ఇడ్లీ ఇస్తే తినలేదనే కోపంతో హత్యకు పాల్పడిన ఘటన ఏపీలో కలకలం రేపింది.

ఇంకా చదవండి ...
  AP Crime News: కొందరి ఆవేశానికి హద్దులు ఉండడం లేదు.. క్షణికావేశంలో ఎంతకైనా తెగిస్తున్నారు. ఇక మద్యం మత్తులో ఉంటే మనుషులం అన్న సంగతే మరిచిపోతున్నారు. చాలా చిన్న విషయాన్ని సైతం.. ఏదో ఘోరంలా భావిస్తున్నారు. క్రిమినల్స్ (Criminal) గా మారుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా (Guntur District) లోని అంకిరెడ్డిపాలెం (Ankireddypalem) డొంకరోడ్డులోని హలోబ్రిక్స్‌ కంపెనీ దగ్గర జరిగిన యాచకుడి హత్యకేసు (Beggars Murder)లో మిస్టరీ వీడింది. ఈ హత్య (Murder) వెనుక జరిగిన గొడవ చూస్తే.. ఈ మాత్రానికే హత్య చేయాలా అని అంతా నోరెళ్లబెడుతుననారు. ఆకలితో అలమటిస్తున్న ఓ యాచకుడు.. దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఓ యుకుడు టిఫెన్ పొట్లాంతో అక్కడి వచ్చాడు. అలా వచ్చిన యువకుడు.. ఆ యాచకుడిని టిఫిన్ ఇస్తూ.. చెడ్డీ గ్యాంగ్ మనిషివా.. మారువేషంలో ఇలా తిరుగుతున్నావా అని ప్రశ్నించాడు.

  ఆ యువకుడి మాటలకు నొచ్చుకున్న ఆ యాచుకుడు.. వారు ఇచ్చిన ఇడ్లీని తిరస్కరించాడు. అలా చేయడమే అతడి పాపం అయ్యింది. ఏదో కోపంలో తన ఆకలి చంపుకుని మరి.. ఇడ్లీని తిరస్కరించాడు. కానీ ఆ పనే అతడి ప్రాణాలు తీసేలా చేస్తుందని ఊహించలేదు.. కానీ ఊహించని దారుణం జరిగింది.. ఇడ్లీ తిరిగి విసిరికొట్టినదే ఆ బిచ్చాగాడికి చివరి రోజు అయ్యింది.

  ఇదీ చదవండి : వైజాగ్ లో షూటింగ్స్ వద్దని సెల్వమణి ఎందుకన్నారంటే..? మంత్రి రోజా క్లారిటీ.. టీడీపీ విమర్శలకు కౌంటర్

  గుంటూరు అర్బన్ నల్లపాడు పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు సౌత్ డిఎస్పీ జెస్సి ప్రశాంతి తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు హోసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యక్తి స్థానికంగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీనిలో భాగంగా మే 1న అర్ధ రాత్రి సమయంలో మహేష్ అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చి.. తనతో తెచ్చుకున్న ఇడ్లీ పొట్లాన్ని బిచ్చగాడికి ఇచ్చాడు. అక్కడితో ఆగిపోతే బాగుండేది.. అందరూ హ్యాపీగానే ఉండేవారు.

  ఇదీ చదవండి : విజయసాయి రెడ్డి న్యూ లుక్ చూశారా..? సజ్జలతో ఏం చెప్పారంటే..?

  కానీ బిచ్చగాడికి పొట్లం ఇస్తూనే..’నువ్వు చడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావ్, పోలీసులతో జాగ్రత్త అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. మహేష్ మాటలకు నొచ్చుకున్న యాచకుడు అతడు ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని విసిరేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మహేష్.. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు అనిల్, సతీష్ తో కలిసి వచ్చి.. బిచ్చగాడిని కొట్టారు. అయనా అతడి కోపం తగ్గలేదు. బిచ్చగాడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకెళ్లి..అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డులోకి తీసుకెళ్లి ముగ్గరు.. విచక్షణ రహితంగా బిచ్చగాడిపై దాడి చేశారు.

  ఇదీ చదవండి : : అమ్మ మనసు ఎంత క్షోభించిందో? పాపం చిన్నారులు ఎలా ఉన్నారో? విషాదం నింపిన వివాదం

  వారు కొట్టిన దెబ్బలు తాళలేక బిచ్చగాడు అక్కడిక్కడే మృతి చెందాడు. బిచ్చగాడు మృతి చెందిన విషయాన్నీ గమనించి మహేష్, అనిల్, సతీష్ అక్కడి నుంచి పరారయ్యారు. బిచ్చగాడి మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈమేరకు ముగ్గురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. మహేష్, అనిల్, సతీష్ లు స్థానికంగా ముఠా పనులకు వెళ్తుంటారని..ఇడ్లి ఇస్తే తినలేదని కారణంతోనే మద్యం మత్తులో బిచ్చగాడని కొట్టినట్లు నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Guntur, Idly

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు