Home /News /andhra-pradesh /

GUNTUR ANDHRA PRADESH CRIME NEWS BAPATLA GANG RAPE CASE ACCUSED THREE MEMBERS ARRESTED NGS GNT

AP Crime New: భర్త కళ్లముందే భార్యను గ్యాంగ్ రేప్ చేసిన నిందుతుల అరెస్ట్.. పట్టించిన గాజులు, చెప్పులు.. ఎలా అంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Crime New: ఆంధ్రప్రదేశ్ లో మానవ మృగాళ్లు రెచ్చి పోతున్నాయి.. రోజు రోజుకు మహిళలు రోడ్డుపైకి వెళ్లాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా జరిగిన గ్యాంగ్ రేపు పెను సంచలనంగా మారింది. అయితే కేసులో నిందితులను.. గాజులు.. చెప్సులే పట్టించాయి.

ఇంకా చదవండి ...
  AP Crime New: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో్ని దారుణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు (CC Camera) పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. దిశ లాంటి చట్టాలు, యాప్ లు ప్రవేశ పెట్టినా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇటీవల వరుసగా అత్యాచార ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి. గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో మానభంగాలకు (Gange Rape) పాల్పడుతున్నారు. తరచూ ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. సినిమాల్లో మాత్రమే చూపించే దారుణాలు.. నిజంగానే జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భర్త కళ్ల ముందే.. అతడికి కిరతంగా కొట్టి.. అతడి కళ్ల ముందే ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ టర్న్ కూడా తీసుకుంది.

  రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె(Repalle) లో జరిగిన అత్యాచారం కేసును పోలీసులు 24 గంటల్లోపే ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బాపట్ల(Bapatla) పోలీసులు.. అయితే నిందితుల్లో ఒకడు మైనర్ అని తెలుస్తోంది. అవనిగడ్డలో పని చేసేందుకు దంపతులిద్దరూ శనివారం అర్ధరాత్రి రేపల్లే రైల్వేస్టేషన్‌లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని బెంచ్ పై పడుకున్నారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన భర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. తరువాత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.

  ఇదీ చదవండి : పొరపాటున తనదే అనుకొని మరో బైక్ లో 2.80 లక్షలు.. చివరికి ఏమైందంటే?

  రైల్వే స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. పోలీస్ సైరన్‌ వినపడడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూసే సరికి.. ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు పోలీసులు. వారి నుంచి వివరాలు తీసుకొని బాధితురాలిని వెంటనే రేపల్లె సీహెచ్‌సీకి తరలించామని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
  ఇదీ చదవండి : జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త.. సీఎం తిరుపతి పర్యటనలో వినూత్న ప్రదర్శన

  మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందన్న విషయంపై కేసు నమోదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రేపల్లె నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించారు. వెంటనే సీన్‌ ఆఫ్‌ క్రైంకి వెళ్లి చూడగా.. గాజులు, చెప్పులు గుర్తించారు వాటి ఆధారంగా అక్కడ నేరం చేసిన తర్వాత నిందితుల్లో ఒకరు షర్ట్‌ మార్చుకున్న ప్రదేశాన్ని డాగ్ స్క్వాడ్‌ బృందం గుర్తించింది.

  ఇదీ చదవండి : పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న గ్యాంగ్ రేప్.. హోం మంత్రి రాజీనామాకు డిమాండ్.. ముగ్గురి అరెస్ట్

  లభించిన ఆధారాల ప్రకారం ముగ్గురు నిందితులకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వారిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని.. బాపట్ల ఎష్పీ వకుల్ జిందాల చెప్పారు. మరోవైపు ముగ్గురిలో ఒకరు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బాధితురాలి భర్త ఇచ్చిన వివరాల ఆధారంగా కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Prakasham dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు