GUNTUR ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY WIFE YS BHARATI INTERVIEW ON GOSALA SHE REVELS CHILDHOOD MATTERS NGS
YS Bharathi: మామయ్య చెప్పిన పెట్టుబడి సూత్రం అది.. ఇప్పుటికీ ఫాలో అవుతున్నా..
ఆసక్తికర విషయాలు చెప్పిన వైఎస్ భారతి
YS Barathi: ఆంధ్రప్రదేశ్ సీఎం సతీమణి వైఎస్ భారతి చిన్ననాటి విషయాలను తొలిసారి పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఎక్కడ రివీల్ చేయని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అమ్మ గురించి.. మామయ్య గురించి ఆమె ఏమన్నారంటే..?
YS Barathi: ఆవులు.. ప్రకృతి..పై ఏసీ సీఎం జగన్ (CM Jagan) దంపతులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. చాలా సంద్భాల్లో అది మనకు కనిపించింది. తాజాగా వైఎస్ జగన్ దంపతులు తాడేపల్లిలోని తమ నివాసంలో గోశాలను ఏర్పాటు చేశారు. అచ్చం అక్కడ అంతా పెల్లె వాతావరణం ఉండేలా కనపిస్తోంది. వినూత్న ఆకృతిలో ఈ గోశాలను ఏర్పాటు చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ నిర్మాణం వెనుక ఉన్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భార్య..వైఎస్ భారతి (YS Bharathi) అని చాలమందికి తెలియకపోవచ్చు. తాజాగా భారతిని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి (Shilpa Reddy).. గోశాలలో ఇంటర్వ్యూ చేయడంతో.. ఆమె గురించి చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా గోశాల నిర్మాణం.. అదే విధంగా ఆమె వ్యక్తిగత విషయాల భారతి ఆమెతో పంచుకున్నారు. గోశాల నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, తన చూపును తిప్పుకోలేకపోతున్నానని శిల్పారెడ్డి కొనియాడారు. ఆ నిర్మాణం చాలా సంప్రదాయబద్దంగా ఉంది.. మీరు నిర్మాణం విషయంలో ఎలాంటి ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారని ఆమె అడిగారు. సీఎం సతీమణి స్పందిస్తూ గోశాలను ఏ విధంగా నిర్మించాలనే విషయంపై పూర్తి వివరణ ఇవ్వకపోయినా.. ఎక్కువగా కృత్రిమ మెటీరియల్ను వాడొద్దని నిర్ణయించామని.. అందులో భాగంగా వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండే వస్తువులను ఉపయోగించామని చెప్పారు.
తనకు మొక్కలు, చెట్ల పెంపకమంటే చాలా ఇష్టమని వైఎస్ భారతి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే మామయ్య దివంగత వైఎస్ రాజశేఖర్ (YS Rajasekhar Reddy) రెడ్డి గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ చెట్లను పెంచేవారని.. వీటిని చూసిన చాలామంది ఏదైనా పంట వేయకుండా ఇలా ఎందుకు చెట్లను పెంచుతున్నారని అడిగేవారని.. అందుకు ఆయన చెప్పేవారంటే..? ఇది భవిష్యత్తు కోసం నేను పెడుతున్న పెట్టుబడి అనేవాళ్లు. ఆ మాట తన మనసులో నాటుకుపోయిందని అందుకే తానుకూడా దాన్ని ఫాలో అవుతున్నానని చెప్పారు.
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడంపైనా శిల్పారెడ్డి ప్రశ్నలు వేశారు. బొప్పాయి మొక్కను మొదట కుండీలో పెంచి ఆ తర్వాత పెరట్లో నాటామన్నారు. అలాగే మొక్కజొన్నను కూడా కుండీలలో పెంచామని వెల్లడించారు. అలాగే ఇంట్లో వండుకునేందుకు ప్రకృతి సిద్ధంగా లభించేలా పాలకూర, మెంతి కూర కూడా పెంచుతున్నామన్నారు. తనకు మొక్కలు, చెట్ల పెంపకం అంటా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.
మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా అని పేర్కొన్నారు. ఇంట్లోనే కొన్ని కూరగాయలు, ఆకు కూరలు పెంచుకోవడం, బయట ఫుడ్ తగ్గించి స్వయంగా వండుకొని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలమ ఆమె అభిప్రాయపడ్డారు. తన చిన్నతనంలో అమ్మ రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు, పాలు వేసి కలిపి పెట్టేవారని.. అది పొద్దునకల్లా పెరుగన్నంగా మారేదని.. ఇప్పటికీ మా అమ్మ అదే చేస్తుంటారని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.