K. Gangadhar, News18, Guntur
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధ్యార్ధులకు మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమం జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా ఈ నెల 22నుండి రాగి జావను అదనంగా చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ చేతుల మీదుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్ఛ్యువల్ పద్దతిలో ప్రారంభించారు.
ఎండలు ముదురుతున్న సందర్భంగా రాగిజావ త్రాగడం వలన పిల్లలకు వడదెబ్బ తగలకుండా ఉండటమే కాకుండా ఎన్నో రకాల పోషకాలతో పాటు పిల్లల ఎముకలు గట్టి పడతాయని, తద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే రోజు విడిచి రోజు వారానికి మూడు సార్లు ఇస్తున్న చిక్కీలతో పాటు రాగి జావ అదనంగా ఇవ్వనున్నారు.మిగతా మూడు రోజులు విద్యార్థులకు రాగి జావను అందించనున్నారు. ప్రభుత్వం రాగి జావను ఇవ్వటంపై విధ్యార్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News