Home /News /andhra-pradesh /

GUNTUR ANDHRA PRADESH CM JAGAN WILL GO PARIS TOMORROW FOR HIS DAUGHTER GRADUATION CERTIFICATE NGS GNT

CM Jagan Paris Tour: రేపు పారిస్ కు సీఎం జగన్.. కుటుంబ సమేతంగా పయనం.. ఎందుకంటే..?

పారిస్ టూర్ కు సిఎం జగన్

పారిస్ టూర్ కు సిఎం జగన్

CM Jagan Paris Tour: వరుసగా రెండో విదేశీ టూర్ కు సిద్ధమయ్యారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇటీవల పెట్టుబడుల వేట కోసం దావోస్ వెళ్లి వచ్చిన ఆయన.. ఇప్పుడు పారిస కు బయలుదేరుతున్నారు. అయిత అది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం అయితే.. ఇప్పుడు పర్సనల్ పనిపై పారిస్ వెళ్తున్నారు. అదీ కుటుంబ సమేతంగా.. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...
    CM Jagan Paris Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) రేపు మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. గత నెలలో దావోస్ పర్యటనకు (CM Davos Tour) వెళ్లిన సీఎం జగన్.. పెట్టుబడులు తీసుకురావడంలో పూర్తి సక్సెస్ అయ్యారు.. విదేశీ వ్యాపార వేత్తల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక వ్యక్తిగతంగానే జగన్ ప్ర్తత్యేక ఆకర్షణగానే నిలిచారు. యువకుడిలా స్టైలిష్ లుక్ తో ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేశారు. అయితే ఆ పర్యటన మొత్తం పెట్టుబడులు తేవడం కేంద్రాగానే జరిగింది. కానీ ఇప్పుడు పారిస్ పర్యటన (Paris Tour) అందుకు పూర్తిగా భిన్నం.. ఇది పూర్తి పర్సనల్ టూర్. ఇంతకీ సీఎం జంన్ ఎందుకు పారిస్ వెళ్తున్నారంటే..

    నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ ఈ నెల 28న ఫ్రాన్స్‌కు బయలుదేరుతున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎంబీఏ) పూర్తి చేసుకున్నారు. దీంతో గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న కోసం రేపు (మంగళవారం) రాత్రి 7.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం నుంచి జగన్ బయలుదేరుతారు. పారిస్‌లో వ‌చ్చే నెల 2వ తేదీ వ‌ర‌కు ఆయన ప‌ర్య‌టించ‌నున్నారు. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్‌.. 29న పారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు. ఆ తర్వాత జులై 3న ఆయ‌న తిరిగి తాడేప‌ల్లి చేరుకుంటారు.

    ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ జ‌గ‌న్ ఇటీవ‌లే పిటిష‌న్ దాఖలు చేయ‌గా.. నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు అందుకు అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో సీఎం షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. అలాగే ఈ పారిస్ టూర్ వ్యక్తిగతమే.

    ఇదీ చదవండి : ఎద్దుల కుమ్ములాటలో న్యాయవాదికి గాయాలు.. కార్పొరేషన్ అధికారులపై కేసు

    హర్ఫ రెడ్డి పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్‌ స్కూల్‌లో ఆర్థిక శాస్త్రం చదువుతోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పారిస్‌లో ఆమె మాస్టర్స్ అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన జరిగే ఆమె కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ తన కుటుంబంతో సహా పారిస్ పయనం అవుతున్నారు. అటు సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లు సమాచారం.

    ఇదీ చదవండి : వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం.. అందుబాటులోకి ఇగ్లూ థియేటర్.. ప్రత్యేకతలు ఏంటంటే?

    ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల తన పాదయాత్రకు విరామం ఇచ్చి మరీ అమెరికా వెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త అనిల్ కుమార్, మరో కుమార్తెతో కలిసి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Cm jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు