CM Jagan Mohan Reddy: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ (Loan Apps)ల ఆగడాలు రోజు రోజుకూ పెరుగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అయితే ఈ లోన్ యాప్ (Loan APP) ల ఆగడాలు ఎవరినీ వదలడం లేదు. వారి వేధింపులకు ఆత్మహత్య (Suicide) లు చేసుకునే పరిస్థితి నెలకొంది. రోజుకోచోట ఈ లోన్ యాప్‌ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యవసరం అనో.. లేక ఎలాంటి నిబంధనలు లేకుండా లోను ఇస్తున్నారనో అశపడితే.. తరువాత చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కసారి వారి దగ్గర రుణం తీసుకుంటే అంతే సంగతులు. ఆ మాఫియా వేధింపులకు ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. చాలా మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈజీగా లోన్లు ఇచ్చేసి సకాలంలో చెల్లించకపోతే మానిసంగా వేధిస్తూ జీవితంపై విరక్తిపుట్టేలా చేస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేని వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.తాజాగా అల్లూరి సీతారామ రాజు జిల్లా (Alluri Sitarama Raju District) రాజవొమ్మంగి చెందిన 23 ఏళ్ల కొల్లి దుర్గాప్రసాద్, 24 ఏళ్ల రమ్యలక్ష్మి దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే ఆ మధ్య క్రితం ఇంటి అవసరాల కోసం.. సెల్‌ఫోన్ ద్వారా లోన్ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు. మీ నగ్న చిత్రాలు తమ దగ్గర ఉన్నాయని.. వెంటనే అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం అంటూ బెదిరింపులకు దిగారు.
ఇదీ చదవండి : కింగ్ నాగార్జున విజయవాడ ఎంపీగా పోటీచేస్తున్నారా..? ఇదిగో క్లారిటీ..
అక్కడితోనే వారి వేధింపులు ఆగలేదు. దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ విషయం తెలియడంతో సీఎం జగన్ తీవ్రంగా చలించి పోయారు. దీంతో వారి ఇద్దరి చిన్నారులు 4 ఏళ్ల నాగసాయి, 2 ఏళ్ల లిఖిత శ్రీ అనాధలుగా మిగిలారు. ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులు ఇద్దరికి చెరో 5 లక్షల రూపాయల సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలతకి ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి: సీతాఫలాలతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భయపెడుతున్న ధరలు
సీఎం జగన్ ఆదేశాల మేరకు లోన్ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Loan apps