Good News: సాధారణంగానే వేసవి (Summer) వచ్చిందంటే విద్యుత్ కోతల (Power Cuts) భయం వెంటాడుతుంది. ఇక గత రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అనే భయం అందరిలో మొదలవ్వడం సహజం. ఇప్పటికే చాలా చోట్ల వేసవి ప్రభావం కనిపిస్తోంది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మార్చి నలాఖరు తరువాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో అనే భయం వెంటాడుతూనే ఉంది. దానికి తోడు ఎప్పటిలానే విద్యుత్ కోతలు ఉంటే ఇక అంతే సంగతులు.. అందుకే వేసవి తాపం అంటేనే ఏపీ ప్రజల్లో టెన్షన్ మొదలవుతోంది. అయితే గత అనుభవాల నేపథ్యంలో సమ్మర్ కు ముందే ఏపీ ప్రభుత్వం (AP Government) అలర్ట్ అయ్యింది. ఈ సారి వేసవికి విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ (Vijayanand) వెల్లడించారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Mohan reddy) ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఆయన ఆదేశాలతో ప్రణాళికాబద్ధంగా వేసవి డిమాండ్‌ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో తాజా గణాంకాలే అందుకు నిదర్శనం.. గతేడాది ఫిబ్రవరిలో సరాసరిన రోజుకి 202 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 227 మిలియన్ యూనిట్లకు డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఒక్క ఫిబ్రవరి నెలలోనే దాదాపు 25కు పైగా యూనిట్లు ఖర్చు అయ్యాయి.
ఇక గత ఏడాది మార్చి నెలలో రోజుకి 212 మిలియన్ యూనిడ్ల డిమాండ్ ఉంటే ఇపుడు 232 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో పీక్ డిమాండ్ 232 మిలియన్ యూనిట్ల కాగా.. ఈ ఏడాది మార్చి రెండవ వారంలోపే 232 మిలియన్ యూనిట్లు దాటామంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఏపీలో పెరిగిన పరిశ్రమల కారణంగా వాణిజ్య అవసరాలకి 18 శాతం, పరిశ్రమలకి 20.31 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది అని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. నామినేషన్లు దాఖలు.. టీడీపీ బిగ్ ట్విస్ట్
ఈ కారణంగానే విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా రికార్డు స్ధాయికి పెరిగింది అంటున్నారు విద్యుత్ అధికారులు. మార్చి నెలాఖరుకి 240 మిలియన్ యూనిట్లు.. ఏప్రిల్ నెలకి 250 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం అంటున్నారు. ఇక ఏప్రిల్ నెలలో ఒక్క వ్యవసాయానికే సరాసరిన 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. పెరిగిన డిమాండ్ కి తగ్గట్లుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే పరిశ్రమలకి, గృహావసరాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి : పాపం సాగర తీరంలో అనుకోని అతిథి.. మత్స్యకారుల ప్రయత్నం విఫలం
ఇక కృష్ణపట్నం మూడవ యూనిట్ ద్వారా 800 మెగా వాట్ల విద్యుత్ నేటి నుంచి పూర్తిగా అందుబాటులోకి రావడం శుభపరిణామం. సెమ్ కాబ్ ద్వారా 500 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మార్కెట్‌లో యూనిట్ ధర 12 రూపాయిలుంటే వేసవి అవసరాలను దృష్డిలో పెట్టుకుని ముందుగానే మార్చి, ఏప్రిల్ నెల కోసం యూనిట్ 7.90 రూపాయలకు విద్యుత్ కొనుగోలుకి ఎంఓయు చేసుకున్నాం. అదే విధంగా ఇతర రాష్ట్రాలతో 300 మెగా వాట్ల విద్యుత్‌కి బ్యాంకింగ్ ఒప్పందాలు చేసుకున్నాం అన్నారు విజయానంద్. మరి అధికారులు చెప్పిన మాట ఎంత వరకు వాస్తవం అవుతుందో చూడాలి.. ఏపీ ప్రజలు మాత్రం కోతలు లేకుండా చూడాలి అని కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, ELectricity