హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Arogya Sri: అక్టోబర్ 15 నుంచి పేద ప్రజలకు మరో శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

Arogya Sri: అక్టోబర్ 15 నుంచి పేద ప్రజలకు మరో శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ (ఫైల్ )

పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ (ఫైల్ )

Arogya Sri: వైద్యరంగంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. పేదవాడికి వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. తాజాగా మరో శుభవార్త చెప్పారు సీఎం.. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఆరోగ్య సేవల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Arogya Sri: సంక్షేమ పథకాలు (Welfare Schemes) ప్రకటించడంలో తనకు తానే సాటి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిరూపించుకుంటున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలను అమలు చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వైద్య రంగంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. పేదవాడికి వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. కొత్త వాటిని ప్రారంభిస్తూనే ఉన్నారు. సీఎం ఆదేశాల మేరకు తాజాగా పేద ప్రజలకు మేలు చేకూరే విధంగా.. కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం (AP Government). రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ (Arogya Sri) కింద 3,254 ప్రొసీజర్లకు పెంచనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని (Vidadala Rajani) వెల్లడించారు.

  2007లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 942 ప్రొసీజర్స్ తో ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే.. తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి బాటలో నడుస్తూ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 1059 ఉన్న ప్రొసీజర్స్ ను 2,446కు పెంచారని, ఈ నెల 15 నుంచి 3,254 ప్రొసీజర్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నారని, ఇది చాలా శుభపరిణామని మంత్రి పేర్కొన్నారు.

  పేదలకు ఉచిత వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి విడదల రజనీ.. ఎంత ఖర్చైనా పేదవాడికి మంచి వైద్య అందించడానికి జగనన్న ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గతప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కేవలం 117 ప్రొసీజర్లు మాత్రమే పెంచిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఏటా 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, గత మూడేళ్లలో 6 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. హై ఎండ్ ప్రొసీజర్స్ కి అదనంగా అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

  ఇదీ చదవండి : చంద్రబాబుకు మరో టెన్షన్.. ముదిరిన చిరంజీవి vs బాల‌కృష్ణ పోరు.. టీడీపీ కీలక అదేశాలు

  పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ గా ఉందని మంత్రి విడదల పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనేదే జగనన్న లక్ష్యమని.. గత ప్రభుత్వాలు వైద్య రంగంపై నిర్లక్ష్యం వహిస్తే.. జగనన్న ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

  ఇదీ చదవండి: తిరుమల వెళ్లేందుకు సిద్ధమవుతున్న శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన

  రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు కింద 16 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏటా 13 వేల కోట్లు వైద్య, ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. మన్యం జిల్లాతో కలిపి మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు 8 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో 3,820 కోట్లతో నాడు-నేడు కింద ఆధునీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వైద్య రంగానికి మహర్థశ తీసుకొస్తున్నారని తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Aarogyasri, Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Vidadala Rajani