హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: సంక్షేమ హాస్టల్స్ పై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏమన్నారంటే?

CM Jagan: సంక్షేమ హాస్టల్స్ పై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏమన్నారంటే?

సంక్షేమ హాస్టల్స్ పై సీఎం జగన్ సంచలన నిర్ణయం

సంక్షేమ హాస్టల్స్ పై సీఎం జగన్ సంచలన నిర్ణయం

CM Jagan: సంక్షేమంపై ఫోకస్ చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా మరికొన్ని నిర్ణాయాలు తీసుకున్నారు. గురుకుల హాస్టల్స్ లో సౌకర్యాలు పెంచాలని.. అలాగే అంగన్ వాడీ ల్లో ఇచ్చే సరుకుల నాణ్యత పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

CM Jagan: సంక్షేమంలో తాను ముందే ఉంటానని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ముందు ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఏపీలో సంక్షేమ హాస్టళ్లు (Welfare Hostels), మహిళా,శిశు సంక్షేమశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. 3,364 కోట్ల రూపాయలతో హాస్టళ్లలో నాడు–నేడు (Nadu Nedu) కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా హాస్టళ్ల కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రానున్న మూడు నెల్లలోగా అన్నీ అంగన్‌వాడీలల్లో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అంగన్‌వాడీలలో టాయి లెట్ల నిర్వహణ, పరిశుభద్రతకు పెద్దపీట వేయాలి అన్నారు. అలాగే గురుకుల పాఠశాలలో మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమం నిర్వాహించాలన్నారు. పిల్లలు హాస్టళ్లకి వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం ఉండకూడదన్నారు. హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్‌ బెడ్స్‌.. ఇతర సౌకర్యాలన్నీ నాణ్యతతో ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తం 3013 చోట్ల నాడు–నేడు పనులు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు‌. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా ఫస్ట్ ఫేజ్‌లో బాగుచేయాలన్నారు. దీంతో పాటు ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్‌ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఇక ట్రైబల్‌ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తార‌ని, వారు బాగా చదువుకోవడానికి, వారు బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాల‌ని జగన్ ఆకాంక్షించారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి : చంద్రబాబు చెప్పిందే నిజమే.. ఈ ఎన్నికల్లో ప్రజలు గుడ్ బై చెప్పనున్నారు

అంగన్‌వాడీలలో సూపర్‌ వైజర్ల పోస్టులను భర్తీచేశామన్నారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను అధికారులు వివ‌రించారు. అక్టోబరు నెలలో నూటికి నూటికి నూరుశాతం పంపిణీ జరిగిందన్నారు. డిసెంబర్‌1 నుంచి ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, పైలెట్‌ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్‌వాడీల్లో అమలు చేస్తామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

ఉత్తమ కథలు