హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: మైనారిటీలపై వరాల జల్లు.. 4 నెలల్లో 10 కోట్లు జమ

CM Jagan: మైనారిటీలపై వరాల జల్లు.. 4 నెలల్లో 10 కోట్లు జమ

మైనారటీలపై వరాల జల్లు

మైనారటీలపై వరాల జల్లు

CM Jagan: రాష్ట్రంలో ముస్లిం పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్ అయితే ఆయన కొడుకుగా తాను రెండు అడుగులు ముందుకు వేశాను అన్నారు సీఎం జగన్.. అందుకు మహానేత తనయుడిగా గర్వపడుతున్నాను అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ముస్లిం పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్ (YSR) అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. అయితే ఆయన కొడుకుగా తాను రెండు అడుగులు ముందుకు వేశాను అన్నారు. అందుకు మహానేత తనయుడిగా గర్వపడుతున్నాను అన్నారు. పదవుల నుంచి సంక్షేమ పథకాల(Welfare Schemes) వరకు అన్ని విధాలా మైనార్టీలకు న్యాయం చేస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటికే  ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చామని.. నలుగురికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చామన్నారు. మన ప్రభుత్వంలో పదవులు, సంక్షేమంలో ఏరకంగా చూసుకున్నా.. స్పష్టమైన మార్పులు కనిపిస్తాయన్నారు. గుంటూరు నగరంలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

చక్కటి చిరునవ్వుతో, మనసు నిండా ఆప్యాయతలు పంచిపెడుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్రతీ మైనార్టీ సోదరులకు, ప్రతీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకు సోదరుడు, స్నేహితుడు, కుటుంబ సభ్యుడుగా ప్రేమపూర్వకమైన అస్సలామ్‌ అలైకుమ్ అంటూ అభివాదం చేశారు.

ఈరోజు పదవుల విషయంలో, సంక్షేమంలో ఏరకంగా చూసుకున్నా.. రాష్ట్రంలో 2019 నుంచి మన ప్రభుత్వం వచ్చిన తరువాత గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కనీసం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసురాలేదు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన ప్రభుత్వంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో మైనార్టీ సోదరుడు ఉన్నాడంటే మార్పు ఏ విధంగా ఉందో గమనించాలని కోరుతున్నాను.

ఇదీ చదవండి : రైతులకు సిరులు కురిపిస్తోంది.. మగవారి నరాల బలహీనతకు చెక్ పెట్టే సీతాఫలం..

మన పార్టీ నుంచి నలుగురు మైనార్టీ సోదరులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోగలిగాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా చేశాం. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా నా అక్క శాసనమండలి ఉపాధ్యక్ష పదవిలో ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. మైనార్టీ సోదరుడు ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా ఉన్నాడు. ఇవన్నీ ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. మనసుపెట్టి పరిపాలన చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు శుభవార్త.. మూడు నెలల పాటు ఉచిత బియ్యం.. ఈ నెల 19 నుంచి ఇవ్వాలని నిర్ణయం

గత ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు పలానా మంచి చేయాలనే తపన, తాపత్రయం కనిపించలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప.. ముస్లింల సంక్షేమానికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రతీ అడుగు కూడా మంచి చేయాలి.. ఆ మంచితో ప్రతీ గుండెలో చిరస్థాయిగా నిలబడిపోవాలని అడుగులు వేస్తున్న మన ప్రభుత్వంలో మార్పు చూడమని కోరుతున్నాను.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Ap government, AP News

ఉత్తమ కథలు