M Jagan Mohan Reddy: తాను రైతు పక్షపాతి అని సీఎం జగన్ (CM Jagan) మరోసారి నిరూపించుకున్నారు.. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నా.. రైతన్నలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే ఉన్నారు. తాజాగా వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని (YSR Yantra Seva Scheme) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్ జగన్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. గుంటూరు జిల్లా (Guntur District) లోని చుట్టగుంట దగ్గర 'వైఎస్సార్ యంత్ర సేవ పథకం' రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) పాల్గొన్నారు. పథకంలో భాగంగా రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ చేశారు.. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు 175.61 కోట్ల రూపాయల సబ్సిడీని సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.
రైతులకు యంత్రాలు ఇచ్చిన సందర్భంగా ఈ రోజు గొప్ప కార్యక్రమం జరుగుతోందని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలోనూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ నిర్మించామని గుర్తుచేశారు. ఆర్బీకేలు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ.. విత్తనం సరఫరా నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 10,750 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయం ఇంకా మెరుగుపర్చేందుకు, రైతుకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే, అదే గ్రామాల్లోనే తక్కువ ధరలోనే వారికి అందుబాటులోకి తెచ్చాం అన్నారు.
రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. అలాగే మరో 50 శాతం రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకులతో మాట్లాడి మంజూరు చేయిస్తున్నామన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు.. వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరలకే అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం జగన్.
ఇదీ చదవండి : ఏపీలో మొన్నటి వరకు పరిశ్రమలకు పవర్ హాలిడే.. ఇప్పుడు క్రాప్ హాలిడే..? ఎక్కడో తెలుసా..?
రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. మరో 50 శాతం రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకులతో మాట్లాడి మంజూరు చేయిస్తున్నామన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు.. వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరలకే అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం జగన్.
ఇదీ చదవండి : జనసేన కోసం ఆ సీటును టీడీపీ రిజర్వ్ చేసిందా..? అందుకే బాధ్యతలు ఎవరికీ ఇవ్వడం లేదా..?
ఇదే కార్యక్రమంలో భాగంగా గతంలో చంద్రబాబునాయుడు హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారని అయితే అవి కూడా రైతులు ఎవరూ కూడా వాళ్లు ట్రాక్టర్ల ఆర్డర్లు ప్లేస్ చేయలేదు అని జగన్ గుర్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబునాయుడు అంతా కలిసికట్టుగా ట్రాక్టర్ల డీలర్లతో స్కామ్‌లు చేశారు తప్ప రైతులకు మేలు చేయలేదన్నారు. అప్పటికీ ఇప్పటికీ తేడాను తాను గమనించాను అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ దగ్గర నుంచి ఏ పనిముట్టు కావాలన్నా నేరుగా రైతు ఇష్టానికి వదిలిపెట్టామని భరోసా ఇచ్చారు జగన్. రైతు ఏ ట్రాక్టర్‌నైనా తనకు నచ్చిన కంపెనీ, తనకు నచ్చిన పనిముట్టు తానే ఆర్డర్ ప్లేస్ చేస్తాడన్నారు.
అవినీతి లేకుండా 175 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు. ఎవరైనా రైతులు ఈ లబ్ధి పొందాలి అనుకుంటే.. నేరుగా తమ ఆధార్ కార్డులు.. పాసు పట్టా పుస్తకం పట్టుకుని.. కేఆర్బీకే కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తమకు నచ్చిన కంపెనీను.. పని ముట్లను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes, Guntur