Black Fungus: రోజూ ఈ జాగ్రత్తలు తీసుకోండి... బ్లాక్ ఫంగస్ రాకుండా చూసుకోండి... ఆయుష్ డాక్టర్ల సలహా ఇదే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కరోనాతో (Corona) పాటు దేశాన్ని వణికిస్తున్న మరో జబ్బు బ్లాక్ ఫంగస్ (Black Fungus). కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 • Share this:
  ప్రస్తుతం కరోనాతో పాటు దేశాన్ని వణికిస్తున్న మరో జబ్బు బ్లాక్ ఫంగస్. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళ్లు, ముక్కులో ఇన్ ఫెక్షన్లు రావడం వ్యాధి ముదిరితే మనిషి ప్రాణాలు పోవడం జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నా... అది అంటువ్యాధి కాదు కాబట్టి ప్రజలు కొంత ధైర్యంగా ఉండొచ్చు. ఐతే వ్యాధి మనకు సోకకుండా రోజూ ఏం చెయ్యాలనేదానిపై ఆయుష్ డాక్టర్లు సలహాలిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మనకు అలవాటు అయిపోయింది. అందువల్ల కరోనా వార్తలు మనకు అంతగా భయం కలిగించట్లేదు. కానీ బ్లాక్ ఫంగస్... సోకితే... చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా త్వరగా చనిపోతున్నారు. అది బ్లాక్ ఫంగస్ అని తెలుసుకొని... ట్రీట్‌మెంట్ ప్రారంభించేసరికే... పరిస్థితి చేయిదాటిపోతోంది. మనం ఓ విషయం మర్చిపోకూడదు. మన చుట్టూ ఉన్న గాలిలో... లెక్కలేనన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు ఉంటున్నాయి. మనలో ఇమ్యూనిటీ వాటిని అడ్డుకుంటోంది.

  ఒక్కసారి ఆ ఇమ్యూనిటీ పోతే... ఇక వైరస్‌లు, ఫంగస్‌లకు గేట్లు తెరిచినట్లే. సో... మన ఫస్ట్ ఫోకస్... ఇమ్యూనిటీపై ఉండాలి. ప్రతి రోజూ ఇమ్యూనిటీ పెంచుకోవాలనే ఆలోచనతోనే అన్నీ తినాలి. ఈ రోజుల్లో కరోనా నుంచి తప్పించుకున్న చాలా మందికి బ్లాక్ ఫంగస్ (Mucormycosis) పట్టుకుంటోంది. ముఖ్యంగా స్టెరాయిడ్లు వాడిన వారికి ఇది సోకుతోంది. డయాబెటిక్ పేషెంట్లలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి... వారికి ఇది ఎక్కువగా వస్తుందిపేరుకి తగినట్లుగానే ఈ బ్లాక్ ఫంగస్ అనేది... ఓ రకమైన ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది. దీన్నే సింపుల్ భాషలో బూజు అంటారు. ఇది గాలిలో ఎగిరే బూజు. ఇళ్లలో పరిశుభ్రంగా లేని చోట... ఈ బూజు తిష్టవేస్తుంది. ఎప్పుడు మనిషిని తినేద్దామా అని చూస్తుంది.

  ఇది చదవండి: చీఫ్ విప్ కు చిక్కులు తప్పవా...? సీఎం ప్రకటనపైనే ధిక్కారమా..? తిరుగుబాటుకు కారణం అదేనా..?


  శరీరంలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయినప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ సోకుతుంది. ఇది నోటి ద్వారా రాకుండా ఉండేందుకు నోటి లోపల కూడా మనం క్లీన్ చేసుకోవాలి. టంగ్ క్లీనర్ వాడి.. నాలికపై ఉండే పాచిని పరిశుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజుకురెండు సార్లైనా చేసుకుంటే నోటి ద్వారా ఈ ఫంగస్ రాకుండా చాలా వరకూ అడ్డుకోవచ్చనోటి లోపల నల్లగా కనిపిస్తే... అది బ్లాక్ ఫంగస్ అని గుర్తించాలి. అలాగే కళ్ల చుట్టూ నొప్పి వస్తూ ఉంటే... అది కూడా అదే అని గమనించాలి. ఇక ముక్కులోపల గాలి ఆడకుండా ఏదో అడ్డుకుంటున్నట్లు అనిపిస్తే.., అది కూడా బ్లాక్ ఫంగస్ కావచ్చు. ముక్కు లోంచీ నల్లటి పదార్థం వస్తూ ఉంటే జాగ్రత్త పడాలి. తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా నోటి ద్వారా ఈ ఫంగస్ లోపలికి వచ్చే అవకాశాలు ఎక్కువ.

  ఇది చదవండి: ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా...? రెండు మూడు రోజుల్లో నిర్ణయం..


  గుండె జబ్బు వచ్చిన వారు, డయాబెటిక్ పేషెంట్లు కరోనా సోకినప్పుడు వాడే స్టెరాయిట్లు, మందుల వల్ల నోటి లోపల రకరకాల బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాంటి వారు రోజుకు 2 లేదా 3 సార్లు బ్రష్ చేసుకోవాలని డెంటిస్టులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎక్కువ సార్లు దంతాలు శుభ్రం చేసుకుంటే నోరంతా క్లీన్ అవుతూ... ఆ మాయదారి ఫంగస్ రాకుండా ఉంటుందని చెబుతున్నారు. కరోనా నుంచి రికవరీ అయిన వారు తమ టూత్ బ్రష్, టూత్ పేస్టులను కొన్నాళ్లపాటూ... మిగతా కుటుంబ సభ్యుల బ్రష్‌లు, పేస్టులతో కలిపి ఉంచకూడదు. తద్వారా వారికి కుటుంబ సభ్యులకు ఎలాంటి హానీ జరగకుండా ఉంటుందని చెబుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా నోటిని మాత్రం వీలైనంతగా శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

  ఇది చదవండి: ఆనందయ్య మందుపై ఆయుష్ వైద్యుల కీలక వ్యాఖ్యలు.. సీఎం జగన్ ఏమన్నారంటే..!


  ఐతే బ్లాక్ ఫంగస్ రాకుండా నివారించేందుకు ప్రభుత్వం ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ .ఆర్. శ్రీనివాస్ పలు మందులను సూచించారు. ఆయుర్వేద చికిత్సలో భాగంగా (1) గంధక రసాయనం 500 ఎంజి రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత, (2) వసంతకుసుమాకరస 125 ఎంజీ రెండు సార్లు, (3) వ్యోషా ది వటి 250ఎంజీ రోజుకు రెండుసార్లు, (4) సుబ్రభస్మ500 ఎం జి 50ml గోరువెచ్చని నీటిలో కలిపి నోటిని పుక్కిలించాలి. ఈ మందులను ఆయుర్వేద వైద్యులు పర్యవేక్షణలో మాత్రమే లేదా వారిని సంప్రదించి వాడాల్సి ఉంటుందని శ్రీనివాస్ వెల్లడించారు.

  Anna Raghu, Guntur Correspondent, News18
  Published by:Purna Chandra
  First published: