హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Assembly: 16న ఏపీ బడ్జెట్.. 9 రోజుల సమావేశాలు.. బీఏసీలో నిర్ణయాలు ఇవే.. టీడీపీ వ్యూహం ఏంటంటే?

AP Assembly: 16న ఏపీ బడ్జెట్.. 9 రోజుల సమావేశాలు.. బీఏసీలో నిర్ణయాలు ఇవే.. టీడీపీ వ్యూహం ఏంటంటే?

9 రోజులే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

9 రోజులే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజే హీటు పుట్టించాయి. గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా టీడీపీ వాకౌట్ చేసింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలి.. ఏఏ అంశాలు చర్చించాలి అన్నదానిపై బీఏసీలో నిర్ణయించారు.. ఆ కీలక నిర్ణయాలు ఏంటంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

AP Assembly: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) వాడివేడిగా సాగుతున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం (Governor Speech) సమయంలోనే ఆందోళనలు కనిపించాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP) ఆందోళనలు చేపట్టింది. గవర్నర్ ప్రసంగం చదువుతున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో ప్రాజెక్టులపై అన్ని అసత్యాలే ఉన్నాయంటూ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తరువాత జరిగిన బీఏసీ సమావేశం (BAC Meeting) లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం (Speaker Tammineni) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ముఖ్యంగా 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగ ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy), మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్, టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

అంతకుముందు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఉదయం ప్రారంభమైన సమయంలో టీడీపీ సభ్యులు నిరసనలు తెలిపారు. ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్‌ అన్నారు. అయితే గవర్నర్‌ ప్రసగంలో పోలవరం ప్రాజెక్టు సహా అనేక ప్రాజెక్టులకు సంబంధించి అవాస్తవాలున్నాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు.

పోలవరం సహా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులేవీ జరగడం లేదని.. గవర్నర్‌ ప్రసంగంలో అబద్ధాలున్నాయని టీడీపీ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే గవర్నర్‌ ప్రసంగానికి నిరసనగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

ఇదీ చదవండి : గవర్నర్ ప్రసంగంలో కనిపించని 3 రాజధానుల ప్రస్థావన.. షిఫ్టింగ్ లేనట్టేనా..?

ఏపీ రాజధాని అంశంపై గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించకుండా సీఎం, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ.. ప్రజలను 4 ఏళ్లుగా మోసం చేస్తున్నారని పయ్యావుల విమర్శించారు. అలాగే బీఏసీ నిర్ణాయాలపైనా టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. పలు సమస్యలపై చర్చించాలని పట్టుపట్టినా.. ప్రభుత్వం అంగీకరించలేదని.. కేవలం తాము చెప్పాలి అనుకున్న 24 అంశాలకే సమావేశాలను పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇదే ఆఖరి సమావేశాలని.. అందుకే ఈ సమావేశాలను వినియోగించుకుని ప్రభుత్వాన్ని సభలోనే అంశాలవారీగా నిలదీయాలని టీడీపీ నిర్ణయించింది.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap assembly sessions, AP News, AP Politics

ఉత్తమ కథలు