VV Vinayak: తెలుగు సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు వివి వినయాక్ (VV Vinyak).. టాలీవుడ్ (Tollywood) లో మాస్ చిత్రాలకి కేర్ అఫ్ అడ్రెస్స్ ఆయన.. ఇక ఫ్యాక్షన్ సినిమాలు అంటే గాల్లో సుమోలు లేవాల్సిందే.. అది వినాయక్ స్టైల్.. అంత్యంత త్వరగానే మాస్ సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. ఇప్పటి పరిస్థితి మారిపోయింది. ఈ మధ్య కాలంలో వినాయక్ కు సరైన హిట్టు పడలేదనే చెప్పాలి. ప్రస్తుతం బడా హీరోలందరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో వినాయక్ కు అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం తానే హీరోగా మారి ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో వినాయక్ పై మరో వార్త హల్ చల్ చేస్తోంది. త్వరలోనే రాజకీయాల్లో చేరుతారంటూ రచ్చ మొదలైంది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.
గుడివాడలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానికంగా జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎండ్ల పందాలను ప్రారంభించి.. ఆయన సందడి చేశారు.. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.
VV VINAYAK IN POLITICS || రాజకీయాల్లోకి వివి వినాయక్ || కొడాలి నాని వల్ల... https://t.co/I2BtBY5EtF via @YouTube #vvvinayak #Sankranti #Sankranthi #SankranthiMoguduVeerayya #sankrantispecial #SankrantiGift #SankrantiGift #Sankranti2023 #sankrantispecial
— nagesh paina (@PainaNagesh) January 15, 2023
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివికి రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉందనే ఉద్దేశం కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. 'కొడాలి నాని వల్లే తానీ స్థాయిలో ఉన్నాను అన్నారు. తనకెంతో ఇష్టమైన వ్యక్తి నాని అన్నారు. అక్కడితోనే ఆగలేదు.. కొడాలి ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నారు. అయితే అది జగన్ పై లేదా వైసీపికి అనుకూలంగా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది.
ఇదీ చదవండి : పీక్స్ కు చేరిన బెజవాడ బ్రదర్స్ పాలిటిక్స్.. ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
ప్రతీ ఏట సంక్రాంతికి గుడివాడలో నిర్వహించే కార్యక్రమాలకు ఓ ప్రత్యేకమైన అతిథిని కొడాలి నాని ఆహ్వానిస్తుంటారు. ఇదే విధంగా గత ఏడాది బైరెడ్డి సిద్దార్ధరెడ్డిని ఆహ్వానించారు. ఇప్పుడు వివి వినాయక్ ను పిలిచారు. అతిథిలా వచ్చి వెళ్తే ఎలాంటి చర్చలు ఉండేవి కావు. కానీ ఆయన కొడాలి నాని ఆకాశానికి ఎత్తేయడం.. సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాని చెప్పడం చూస్తే.. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉన్న్టట్టు ఉందనే ప్రచారం పెరుగుతోంది.
ఇదీ చదవండి : తాతయ్యలను ఆటపట్టించిన నారా దేవాన్ష్.. సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన చంద్రబాబు మనవళ్లు
ఆ మధ్య ఏపీ సీఎ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకుడు వినాయక్ హాజరయ్యాడు. అప్పుడు మాట్లాడిన ఆయన.. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు అంటే నాకు చాలా అభిమానం అని.. ఆయన తండ్రి గారిలానే రాజా కూడా ప్రజా అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ సందర్భంగా రాజాకు ‘కాపు కార్పొరేషన్’ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు కూడా. అక్కడితోనే ఆగలేదు జగన్ ప్రసంగాలు, మాటలు తనలో స్ఫూర్తిని నింపాయి అంటూ ఓ రేంజ్ లో జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆ ప్రచారం జరుగుతుండగానే ఇప్పుడు మరోసారి రాజకీయంగా వార్తల్లో నిలిచారు వివి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kodali Nani, VV Vinayak, Ycp