Home /News /andhra-pradesh /

GUNTUR ANCIENT MARTIAL ART SILAMBAM WILL GIVE EXTRA STRENGTH AND SELF DEFENSE SKILLS WHICH IS TEACHING IN GUNTUR ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GSU NJ

Guntur: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!

గుంటూరులో

గుంటూరులో సిలంబంలో శిక్షణ

మన భారతదేశం (India) ఎన్నో యుద్ధకళలకు పుట్టినిల్లు లాంటిది. రామాయణ, మహాభారత కాలం నుండే ఈ యుద్ధకళల ప్రస్తావన ఉంది. అగ్ని పురాణం, అర్థశాస్త్రం లాంటి గ్రంథాలలో కూడా యుద్ధకళల ప్రశస్తి ఉంది. అలాంటి ఎన్నో యుద్ధకళలలో ఎంతో ప్రాశస్త్యం ఉన్నది సిలంబం (Silambam).. కానీ కాలక్రమేణా ఈ యుద్ధకళ కనుమరుగయ్యే స్థాయికి పడిపోయింది.

ఇంకా చదవండి ...
  Sumanth, News18, Guntur

  మన భారతదేశం (India) ఎన్నో యుద్ధకళలకు పుట్టినిల్లు లాంటిది. రామాయణ, మహాభారత కాలం నుండే ఈ యుద్ధకళల ప్రస్తావన ఉంది. అగ్ని పురాణం, అర్థశాస్త్రం లాంటి గ్రంథాలలో కూడా యుద్ధకళల ప్రశస్తి ఉంది. అలాంటి ఎన్నో యుద్ధకళలలో ఎంతో ప్రాశస్త్యం ఉన్నది సిలంబం (Silambam).. కానీ కాలక్రమేణా ఈ యుద్ధకళ కనుమరుగయ్యే స్థాయికి పడిపోయింది. అయితే 2020లో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యుద్ధకళను గుర్తించింది. దీంతో మళ్లీ ఈ యుద్ధకళకు పూర్వవైభవం వచ్చినట్లయ్యింది. సిలంబంకు అధికారిక హోదా రావడంతో పాఠశాలల్లో, బీచ్‌లలో, పార్కులలో కరాటే, తైక్వాండో, జూడోతో పాటుగా సిలబం కూడా బోధిస్తున్నారు. టోర్నమెంట్లు సైతం నిర్వహిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) లో కూడా ఈ సిలంబంపై శిక్షణ ఇస్తున్నారు. అది ఎక్కడో తెలుసుకోవడానికి ముందు అసలు సిలంబం అంటే ఏంటి? దాని వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం..!

  మనకు మనమే రక్ష..!
  ఆపద సమయంలో చేతికర్ర చేతిలో ఉంటే..అందులోనూ మీరు సిలబంలో శిక్షణ పొందిన వాళ్లయితే… మీకు మీరే రక్ష. ఆ క్షణం మీ చేతిలో కర్ర…నాగుపాములా నాట్యమేయాల్సిందే… ప్రత్యుర్థుల తాటతీయాల్సిందే. ఒక్క కత్తిసాము, కర్రసాము.. వంటివే కాకుండా ఇలాంటి ఎనిమిది రకాల యుద్ధవిద్యలకు మూలం ‘సిలంబం’.

  ఇది చదవండి: వ్యర్థాల నుంచి విద్యుత్‌... ఏపీలో తొలి ప్లాంట్‌ అక్కడే..! ప్రత్యేకతలవే..!  సిలబం అంటే..?
  అగస్త్య రుషి సిలంబానికి ఆద్యుడని అంటారు. భారత దేశం లో ..అతి ప్రాచీన యుద్ధకలలో సిలంబం ఒకటి. 5000 సంవత్సారాలకు పూర్వం అగస్త్య మహర్షి తాళ పత్ర గ్రంథాలలో లికించాడు..! ఆ తాళ పాత్ర గ్రంధాల ఆధారంగా బోధిధర్మ ఈ విద్యని అభ్యసించి ..ఆ విద్యను ..ఆసియా ఖండం మొత్తం నేర్పాంచాడని ప్రతీతి.

  ఇది చదవండి: ఆ ఇల్లే ఓ మాయాద్వీపం.. అంతకంటే పెద్ద మ్యూజియం.. అక్కడ అద్భుతాలెన్నో..!


  తమిళనాట పుట్టిన కళ
  ఈ యుద్ధకళలో ఆయుధమే ప్రధానం. తమిళనాట పుట్టిన ఈ క్రీడలో దాదాపు 18 శైలులు ఉన్నాయి. వెదురు కర్రలను కొన్ని చోట్ల ఈ కళను అభ్యసించడానికి ఉపయోగిస్తే.. మరి కొన్ని చోట్ల కత్తులు, కటార్లు కూడా ఉపయోగిస్తుంటారు. తమిళనాడులో పాండ్య, చోళ, చేర రాజులు పరిపాలిస్తున్న రోజుల్లో ఈ కళ బాగా అభివృద్ది చెందింది. ఒకప్పుడు గురుకులాల్లో విద్యార్థులకు అక్షర విద్యతో పాటు యుద్ధకళలకు సంబంధించిన విద్యను కూడా బోధించేవారు.

  ఇది చదవండి: పేపర్ తో మ్యాజిక్ చేయాలంటే వీళ్ల తర్వాతే ఎవరైనా.. క్రియేటివిటీతో కేకపుట్టిస్తున్న చిన్నారులు


  భయపడ్డ బ్రిటీషర్లు… సిలంబంపై నిషేధం
  పూర్వం రాజులు కర్రసాము , కత్తి సాము విద్యను అభ్యసించేవారు. తమ సైన్యానికి యుద్ధ కళలలో ఒకటైన సిలబం విద్యను నేర్పించేవాళ్లు. భారతీయ రాజుల సైన్యం లో ప్రత్యేక సిలంబం వీరుల సేన ఉండేది. అంతేకాదు నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో సిలంబం వీరులు కీలక పాత్ర పోషించారు. దీంతో ప్రజలు ఎక్కువగా సిలబం నేర్పుచుకుంటే తమకు ప్రమాదం అని హడలిపోయిన బ్రిటీషర్లు సిలంబంపై నిషేధం విధించారు. అలా కొనేండ్లపాటు ఈ యుద్ధకళ గురించి దేశం మరిచిపోయింది. ఈ కళ తెలిసిన కొంతమంది గ్రామస్తులు రహస్యంగా తమ బిడ్డలకు నేర్పించారు.

  ఇది చదవండి: ఆ ఆలయానికి తలుపులే ఉండవు.. అమ్మవారే అంతటికీ రక్ష


  సిలంబంను మళ్లీ గుర్తుచేసిన సినిమాలు
  సిలంబంకు మళ్లీ జీవంపోసింది దక్షిణాది సినిమాలే అనచ్చేమో..!. బ్రిటిషర్లు నిషేధించిన తర్వాత ఈ కళ అంతర్గత ప్రదర్శనలకే పరిమితమైంది. దివంగత నేత ఎంజీఆర్‌ తన సినిమాల్లో సిలబం గురించే తెలిసేలా ఫైట్‌ సీన్స్‌ పెట్టేవారు. అంతేకాదు తెలుగునాట కూడా కత్తిసాము, కర్రసాములతో అద్భుతమైన ఫైట్స్‌ చిత్రీకరించేవారు.

  ఇది చదవండి: పసుపు రంగు పుచ్చకాయల్లో అంత పవరుందా..? ఎగబడుతున్న జనం..


  కేంద్రప్రభుత్వ గుర్తింపు
  ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘సిలంబం’ మార్షల్‌ ఆర్ట్‌ కు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో ఈ ప్రాచీన యుద్ధవిద్య మళ్లీ ప్రాణం పోసుకుంది. 2021లో తమిళ యువజన సంక్షేమ శాఖ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’లో ఈ క్రీడను చేర్చింది. దీంతో సిలంబం క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కోటాలో 3 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తున్నది. సిలంబం గురించి ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ http://www.silambamindia.org/contact.html లింక్‌ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

  ఇది చదవండి: ఆనియన్ దోశ తిన్నాం.. కానీ ఐస్ క్రీమ్, చాక్లెట్ దోశ తిన్నారా..? తింటే వదిలిపెట్టరు బాస్..


  గుంటూరులో సిలంబం శిక్షణ
  ఆల్‌ ఇండియా సిలంబం ఫెడరేషన్‌ సంస్థ ఇండియా ప్రతి రాష్ట్రంలో , గ్రామాల్లోకి కూడా సిలంబం విద్యను.. తీసుకొని వెళ్లేందుకు కృషి చేస్తున్నారు. సిలంబంకు అధికారిక హోదా రావడం.. బాగా ప్రాచుర్యం పొందడంతో చాలా మంది ఈ సిలంబంను నేర్చుకునేందుకు ముందుకువస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు సిలంబంలో శిక్షణ తీసుకుంటూ సింహాల్లా దూకుతున్నారు. AISF ఆధ్వర్యంలో మన గుంటూరులోనూ ఈ సిలంబం శిక్షణ ఇస్తున్నారు. శ్యామలనగర్ మరియు ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వయస్సుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవాళ్లందరికి శిక్షణ ఇస్తున్నారు.  ఈ యుద్ధవిద్యను అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలే నేర్చుకుంటున్నారని ట్రైనర్ రుద్రరాజు వర్మ చెబుతున్నారు. అమ్మాయిలు తమ ఆత్మరక్షణ కోసం ఇది తప్పకుండా నేర్చకోవాలని సూచిస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఎవరైనా నెలకు రూ.1,000 చెల్లిస్తే చాలు.
  ఫోన్ నెంబర్ : +91 92483 66999, రుద్రరాజు వర్మ
  అడ్రస్‌: 5th లైన్‌, శ్యామలానగర్‌, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌ - 522006

  Guntur Map

  ఎలా వెళ్లాలి..?
  గుంటూరు బస్టాండ్‌ నుంచి లోకల్‌ ఆటోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఆటో ఎక్కి డైరక్ట్‌ గా శ్యామలానగర్‌ ఐదో లైన్‌కు వెళ్లొచ్చు. రైలు మార్గం ద్వారా అయితే గుంటూరు రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడ నుంచి ఆటోలో వెళ్లొచ్చు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు