Amavravati Plots: అమరావతి (Amaravati) కోసం భూములు ఇచ్చిన రాజధాని రైతుల పోరాటం నెగ్గిందా..? ఇక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ప్రకటించనుందా..? మూడు రాజధానుల నిర్ణయం మూలన పడినట్టేనా..? ప్రభుత్వం పెద్దలు ఆ మాట చెబుతున్నా... ఆచరణలో అమలు సాధ్యం కాదా... తాజాగా ఏపీ హైకోర్టు (AP Highcourt) తీర్పు తరువాత ప్రభుత్వానికి క్లారిటీ వచ్చిందా.. తాజా పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అనుమనాలు కలగడం సహజం.. ఎందుకంటే అమరావతి రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ తిరిగి ప్రారంభమైంది. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి స్టార్ట్ చేసింది.
రాజధాని కోసం 28వేల 587 మంది రైతులు భూములు ఇచ్చారు. మొత్తం దాదాపు 35వేల ఎకరాల భూమిని అందించారు. దీనికి ప్రతిగా వారికి ప్లాట్లను ఇచ్చేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం 28,587 మంది రైతులు.. 34,385 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. రైతులకు 38,282 నివాస, 26,453 వాణిజ్య ప్లాట్లను ప్రభుత్వం ఇవ్వాల్సింది. దీనిలో 40,378 ప్లాట్లను గత ప్రభుత్వం రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ను ఈ ప్రభుత్వం ప్రారంభించింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్న తరువాత.. రిజిస్ట్రేషన్స్‌ను జగన్ సర్కార్ నిలిపివేయగా.. రైతులు, అమరావతి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్స్ చేయాలని ఆదేశించింది. దీంతో తిరిగి ఆ ప్రక్రియను సీఆర్‌డీఏ ప్రారంభించింది. మిగిలిన 24,357 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ను తాజాగా తిరిగి ప్రారంభించింది.
ఇదీ చదవండి: పెద్ద సినిమాలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త టికెట్ల రేట్లు ఇవే
కోర్టు తీర్పు తరువాత కూడా.. ఏపీ ప్రభుత్వం తమ స్టాండ్ మారాలేదు అంటోంది. అయితే మూడు రాజధానులపై వెనక్కుతగ్గినా అమరావతి రాజధానిగా కొనసాగించడ అన్నది అధికార పార్టీకి ఇష్టం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గేట్టే.. మంత్రుల వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు సైతం కొత్త చర్చకు దారి తీశాలా చేశాయి. 2024 వరకు మన రాజధాని హైదరాబాదే అన్నారు ఆయన. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి అన్నారు. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది అన్నారు. అక్కడితోనే ఆయన ఆగలేదు. అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవన్నారు. తమ ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Ap capital, AP News, Botsa satyanarayana