హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Flexi Warning: అమరావతి రైతులకు వార్నింగ్.. మా జోలికి వస్తే ఎగరేసి నరుకుతాం.. గుడివాడలో ఫ్లెక్సీల కలకలం

Flexi Warning: అమరావతి రైతులకు వార్నింగ్.. మా జోలికి వస్తే ఎగరేసి నరుకుతాం.. గుడివాడలో ఫ్లెక్సీల కలకలం

గుడివాడ లో అమరావతి రైతులకు వార్నింగ్ ఇస్తూ ఫ్లెక్సీలు

గుడివాడ లో అమరావతి రైతులకు వార్నింగ్ ఇస్తూ ఫ్లెక్సీలు

Flexi Warning: అమరావతి రైతుల పాదయాత్ర ఈ రోజు గుడివాడకు చేరింది. అయితే అక్కడ వెలిసిన ఫ్లెక్సీలు చూసి అంతా షాక్ అవుతున్నారు. మా జొలికి వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ.. వైసీపీ యువదళం పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నాని ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Gudivada, India

  Flexi Warning: సేవ్ అమరావతి (Save Amaravati) పేరుతో చేస్తున్న ఉద్యమం వేయి రోజు దాటడంతో.. రాజధాని రైతలు (Capital Farmers) మహాపాద యాత్ర చేపట్టారు. ఈ రాజధాని రైతుల మహా పాదయాత్ర పన్నెండో రోజుకో చేరుకుంది. అయితే పన్నెండో రోజు.. పెడన (Pedana), గుడివాడ (Gudivada) నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ఉదయం పెడన నియోజకవర్గానికి చేరుకుంది. అయితే రైతుల మహాపాదయాత్ర (Mahapadayatra) పై రాళ్ల దాడి చేసే అవకాశముందని పాదయాత్ర నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. భారీ భద్రత మధ్య ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండానే పాదయాత్ర జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఎక్కడికక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.. కానీ 12వ రోజు ఉద్రిక్తతలకు  దారి తీసేలా కనిపిస్తోంది.

  మరోవైపు ఈ పాదయాత్రలో ఫ్లెక్సీలు కలకలం రేపింది. ఈ రోజు రెడ్డిపాలెం మీదుగా గుడివాడలోకి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించనుంది. అయితే రైతుల పాదయాత్ర చేసే మార్గంలో ఫ్లెక్సీలు హెచ్చరికలు వెలిశాయి. తాము ఎవరి జోలికి రామని, తమ జోలికి వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ బ్యానర్లు వెలిశాయి.

  ఈ బ్యానర్లు.. వైసీపీ యువదళం పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పాదయాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించారు. ఇకపై ఎవరూ ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టవద్దని చెబుతున్నారు. అయితే ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారికి పై కఠిన చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

  ఇదీ చదవండి : ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్.. అందరికీ పెన్షన్లు పెంపు.. ఎంతంటే?

  మరోవైపు అమరావతి ఉద్యమంపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని చంద్రబాబు ATM మాదిరిగా మార్చుకున్నారని ఆరోపించారు. YSR చేయూత కార్యక్రమం తరువాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ పేరుతో అమరావతిని దోచుకున్నారని విమర్శించారు. అధికారం పోయిన తర్వాత అమరావతి ఉద్యమం పేరుతో అమరావతి నుండి అమెరికా వరకు దోచుకుతింటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  ఇదీ చదవండి : మొబైల్ ఫోన్ అంత పని చేసిందా..? భర్త చనిపోయిన ఐదు నెలల తరువాత షాకింగ్ ట్విస్ట్

  అమరావతి ముసుగులో చచ్చిపోయిన టీడీపీని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా తీసేస్తున్నామని ప్రభుత్వం ఎప్పుడూ చేయలేన్నారు. కేవలం ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లక్ష కోట్లతో అమరావతిలో రాజధాని నిర్మిస్తే ఆ ప్రాంతమే అభివృద్ధి చెందుతుందన్నారు. కృష్ణాజిల్లాలో కొంత మంది రాజకీయ నిరుద్యోగులు ఉన్నారని.. వారంతా చేవ చచ్చిపోయిన టీడీపీని బ్రతికించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అలాంటి వారే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh, AP News, Gunturu, Kodali Nani

  ఉత్తమ కథలు