Home /News /andhra-pradesh /

GUNTUR ALLEGATIONS OVER POLICE OFFICIALS THAT THEY SUPPORTING GANJA AND GUTKA MAFIA IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Andhra Pradesh: ఏపీలో గంజాయి మాఫియా వెనుక పోలీస్ హస్తం..? అసలు నిజం ఇదేనా..?

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

ఏపీలో గంజాయి, గుట్కా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. వీరికి ఎక్కడి నుంచి రాకూడదో అక్కడి నుంచో సపోర్ట్ వస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    Anna Raghu, Guntur Correspondent, News18

    ఆంధ్రప్రదేశ్ లో గంజాయి, గుట్కా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎస్ఈబీ ఆధ్వర్యంలో దాడులు చేస్తున్నా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాక్ష్యాత్తూ రాష్ట్ర పోలీస్ బాస్ తలచుకుంటే తప్పించి మన పోలీసులకు గంజాయి, గుట్ఖా, ఖైనీ వంటి నిషేధిత పదార్ధాల అక్రమ వ్యాపారం గురించి తెలియలేదా..? అనే పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా తులసివనంలో గంజాయి మొక్క లేదా గంజాయివనంలో తులసి మొక్క అనేది సామెత. మనుషుల వ్యక్తిత్వాన్ని తెలియజేయడం కోసం వాడే సామెత. ఐతే ఇక్కడ మంచి అనేదే లేదని చెప్పాలి. గుట్ఖా, ఖైనీ, గంజాయి వంటి నిషేధిత పదార్ధాల అక్రమ వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు పొట్లాలు ఆరు ప్యాకెట్లుగా సాగుతోంది. ఐతే ఇటీవలి కాలంలో రాష్ట్ర డీ.జీ.పి గౌతం సవాంగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి కోట్ల రూపాయల విలువైన గంజాయి, ఖైనీ, గుట్ఖా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అనేక మందిని అదుపులోకి తీసుకుని వారిపై డ్రగ్స్, గంజాయి, అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. ఐతే ఈ దాడులలో పట్టుబడుతున్న సరుకు అంతా రూపాయిలో పది పైసల వంతే అనేది జగమెరిగిన సత్యం.

    పైగా ఈ దాడుల్లో పట్టుబడుతున్న వాళ్ళంతా చిన్నాచితకా వాళ్ళే గాని పెద్ద పెద్ద తిమింగలాలను ఆయా ప్రాంతాల అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చి మరి రాష్ట్ర సరిహద్దులను దాటించారనే ప్రచారమూ లేకపోలేదు. పాడి గేదెల వంటి అక్రమార్కులను పట్టి జైలుకు పంపిస్తే తమ ఆదాయానికి గండి పడుతుందని కొందరు అధికారులు లోలోన తెగ మధనపడిపోతున్నారంట. ఐతే సాక్ష్యాత్తూ రాష్ట్ర డి.జీ.పినే స్వయంగా రంగంలోకి దిగడంతో తప్పని సరిపరిస్థితులలో అక్కడక్కడా దాడులు నిర్వహించవలసి వస్తుందని, మీ గోడౌన్లు ఖాళీ చేసి కొన్నాళ్ళపాటు ఎక్కడికైనా దూరప్రాంతాలకు వెళ్ళమని సలహాలిచ్చి మరీ సాగనంపుతున్నారంట..!!

    ఇక్కడ వేడి తగ్గాగ మళ్ళీ మేమే తెలియజేస్తాం అప్పటి వరకూ రాష్ట్రం వెలుపలే ఉండమని, లెక్కల్లో చూపించడానికి వారివద్ద పనిచేసే ఒకరిద్దరిని తమకు అప్పజెప్పమని ఒప్పదాలు కూడా చేసుకుంటున్నారంట. ఏదో మీ గంజాయి సొమ్ము తిన్న విశ్వాసం తో మీ.., మా మంచి కోరి చెబుతున్నాం.. మా మాట వింటే మీరు మళ్ళీ మీ అక్రమ వ్యాపారం కొనసాగించుకోవచ్చని లేదంటే మీతో పాటు మేము కూడా బొక్కలోకి వెళ్ళవలసి ఉంటుందని ఉచిత సలహాలు ఇస్తున్నారంట. హాయిగా కలిసి మెలిసి గంజాయి, గుట్ఖా వ్యాపారం చేసుకుంటుంటే ఈ పోలీస్ బాసులు ఓర్వలేకపోతున్నారని.., నెల నెలా మామూళ్ళ రూపంలో లక్షల్లో వచ్చే ఆదాయం అడుగంటిపోతే తాము కొన్న ఇళ్ళు, స్థలాలకి కిస్తీలు ఎక్కడి నుండి తెచ్చికట్టాలని కొందరు పోలీసు అధికారులు తమ క్రింది స్థాయి సిబ్బంది ఎదుట వాపోతున్నారంట..!!

    ఏది ఏమైనప్పటికీ గంజాయి అక్రమార్కులతో పాటు వారికి సహకరిస్తున్న పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మన రాష్ట్రంలో గంజాయి, గుట్ఖా, ఖైనీల అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం సాధ్యంకాదని కొందరు రిటైర్డ్ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Smuggling

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు