హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kidnap Mystery: 50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టమన్నారు.. కోటి డిమాండ్ చేశారు.. చివరకు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఏం జరిగింది అంటే?

Kidnap Mystery: 50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టమన్నారు.. కోటి డిమాండ్ చేశారు.. చివరకు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఏం జరిగింది అంటే?

8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం

8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం

Kidnap Mistery: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిని 8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కథ మలుపులు తిరిగింది. 50 లక్షలు ఇచ్చినా..? వదలం? కోటి రూపాయలు కావాల్సిందే అని డిమాండ్ చేశారు. కానీ రాత్రి అయ్యిసరికి కథ అడ్డం తిరిగింది.. బాలుడు కిడ్నాప్ మిస్టర్ సుఖాంతమైంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Kidnap Mystery: తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను బయటకు పంపించాలి అంటే భయపడే పరిస్థితి నెలకొంది. బయటకు పంపించడమే కాదు.. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలకు సెక్యూరిటీ (No Security for Children) ఉండడం లేదు. పిల్లలను ఎత్తుకెళ్లిపోయే బ్యాచ్ లు పెరుగుతున్నాయి. రోజు రోజూకూ కిడ్నాపర్ల బెడద పెరుగుతోంది. కొంతమంది పిల్లలను అమ్మే బ్యాచ్ అయితే.. మరికొందరు కేటుగాళ్లు పిల్లలను కిడ్నాప్ (Kidnap) చేసి.. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్న చోట్ల తల్లిదండ్రులు (Parents)పై పగ.. కుటుంబ కలహాలు కారణంగా కూడా పిల్లలను అపహరిస్తున్న కేసులు పెరుగుతున్నాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయం భయంగా పెరుగుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేటలో 8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. 8 ఏళ్ల రాజీవ్ సాయి  (Rajeev Sai) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు.

  దసరా పండుగ కోసం వీరి కుటుంబం చెన్నై నుంచి చిలకలూరిపేటకు వచ్చింది. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ కిడ్నాపర్లు ఉదయం నుంచి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.

  కిడ్నాప్ చేసిన రాజీవ్ సాయి అనే బాలుడిని నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మాగుంట పార్వతమ్మ గెస్ట్ హౌస్ సమీపంలో దుండగులు వదిలేసి వెళ్లారు. మరోవైపు కిడ్నాపర్ల ఆడియో కూడా బయటపడింది. తమకు కోటి ఇస్తేనే బాలుడిని విడిచిపెడతామని.. బాలుడు తమ దగ్గరే ఉన్నాడని.. 10 లక్షలు ఇచ్చినా, 50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టబోమని కిడ్నాపర్లు బెదిరించారు. బాలుడిని వీడియో కాల్‌లో చూపిస్తామని ఆడియోలో చెప్పారు.

  ఆడియో కాల్ ట్రాక్.. ఆ కాల్ లో దొరికిన క్లూస్ ప్రకారం.. పోలీసులు చాకచక్యంగా ఈ కిడ్నాప్ కేసును ఛేదించారు. చిలకలూరిపేటలో కిడ్నాప్ చేసిన దుండగులను హైవేపై చేజ్ చేశారు. ఇక ఎలాగైనా దొరికిపోతామని భయపడ్డ కిడ్నాపర్లు.. బాలుడిని వదిలేసి సర్వీసు రోడ్డు మీదుగా పరారయ్యారు. బాలుడిని క్షేమంగా కాపాడిన పోలీసులు చిలకలూరిపేట తీసుకువెళ్లారు. కాగా కిడ్నాపర్లు నార్త్ ఇండియాకు చెందిన వారు అని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Crime news, Kidnap

  ఉత్తమ కథలు