హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నా వయసు 24.. నేను ఆడా మగా..? మీరే తేల్చాలంటూ డాక్టర్లకు మొర.. గుంటూరు వ్యక్తికి వింత పరిస్థితి..!

నా వయసు 24.. నేను ఆడా మగా..? మీరే తేల్చాలంటూ డాక్టర్లకు మొర.. గుంటూరు వ్యక్తికి వింత పరిస్థితి..!

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వింత కేసు

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వింత కేసు

ఓ వ్యక్తికి తాను పుట్టిన 24 ఏళ్ల తర్వాత ఊహించని పరిణామం ఎదురైంది. తనలో వస్తున్న మార్పులు.., ఉన్న లక్షణాలు చూసి తానెవరో తానే నిర్ణయించుకోలేక సతమతమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) కు చెందిన వ్యక్తికి ఎదురైన విచిత్ర అనుభవం ఇది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనిషికి తనమీద తనకే అనుమానం కలిగేలా చేస్తాయి. ముఖ్యంగా పుట్టుకతో వచ్చిన లోపాలు, వ్యాధులు వారిని వింత పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. ప్రాణాపాయం లేని లోపాలే అయినా సమాజంలో తలెత్తుకోలేని విధంగా.., వాటిని బయటకు చెప్పుకోలేక.. వ్యక్తిగతంగా భరించలేక లోలోన కుమిలిపోయే పరిస్థితులు వస్తాయి. అలా ఓ వ్యక్తికి తాను పుట్టిన 24 ఏళ్ల తర్వాత ఊహించని పరిణామం ఎదురైంది. తనలో వస్తున్న మార్పులు.., ఉన్న లక్షణాలు చూసి తానెవరో తానే నిర్ణయించుకోలేక సతమతమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) కు చెందిన వ్యక్తికి ఎదురైన విచిత్ర అనుభవం ఇది. వివరాల్లోకి వెళ్తే.., చక్కనైన రూపం, అందమైన ఆహార్యంతో పాటు చీరకట్టుతో ఓ 24 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు.

తాను మహిళనో పురుషుడినో తేల్చమంటూ అక్కడి వైద్యుల ముందు పెద్ద సమస్యను ఉంచారు. కన్న తల్లి కూడా తాను పురుషుడిని అని చెప్పినా వినిపించుకోవడం లేదని ఇన్నాళ్ళూ తన బాధ ఎవరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకొవాలో అర్ధం కాలేదని తాను జీవితంలో ఏం కోల్పోతున్నానో తెలిసేసరికి ఇంతకాలం పట్టిందని ఆ వ్యక్తి వైద్యుల ఎదుట తన ఆవేదనను వ్యక్తపరిచారు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై సర్పంచుల తిరుగుబాటు..! పొలిటికల్‌గా ఎవరికి ఎఫెక్ట్..?

సాధారణంగా యవ్వనంలో మహిళలలో వచ్చే వక్షోజాల వృద్ధి, రజస్వల వంటి శారీరక మార్పులేవి తనలో సంభవించలేదని పైగా తన జననాంగం నుండి తెల్లగా జిగురు వంటి పదార్ధం వస్తుందని అందు వల్ల తాను మహిళనో పురుషుడినో మీరే నిర్ణయించాలని ఆ వ్యక్తి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులను వేడుకున్నారు.

ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. సీఎం జగన్ వ్యూహం వర్కవుట్ అవుతుందా..?

ఆ వ్యక్తిని పరిశీలించిన డాక్టర్లు ఇది "హైపోస్పేడియస్" అనే అరుదైన వ్యాధిగా డాక్టర్లు గుర్తించారు. సాధారణంగా పురుషులకు వృషణాలపై భాగంలో అంగం పూర్వచర్మంతో కప్పబడి శిశ్నం చివర రంధ్రం ఉంటుంది.దీని ద్వారానే మూత్రవిసర్జన జరుగుతుంది. ఐతే హైపోస్పేడియస్ తో పుట్టిన ఈ వ్యక్తికి మూత్రవిసర్జన రంధ్రం వృషణాల క్రింద చర్మంతో కప్పబడి ఉండటం చేత ఆ వ్యక్తి  పుట్టినప్పుడు ఆతని తల్లిదండ్రులు అమ్మాయిగానే భావించి అలానే పెంచారు.

ఐతే ఈ హైపోస్పేడియాస్ సమస్యను చక్కదిద్దే సర్జరీలు అందుబాటులో ఉన్నాయని.., ఐతే దీనికి ఎంతో ఓర్పు నేర్పు అవసరం అని డాక్టర్లు స్పష్టం చేశారు. సదరు వ్యక్తి నుండి సేకరించిన శ్యాంపిల్స్ ను హైదరాబాద్ లోని సి.సి.యం.బి కి పంపడం జరిగిందని అక్కడి నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా అతనిని అబ్బాయిగా ప్రకటించే అవకాశం ఉందని  వైద్యులు తెలియజేశారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur, Transgender

ఉత్తమ కథలు