K. Gangadhar, News18, Guntur
పల్నాడు జిల్లా..అమరావతి వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్ళి ఇద్దరు యువకులు మరణించిన దుర్ఘటనపై పెదకూరపాడు శాసనసభ్యుడు శంకరరావు ఫైర్ అయ్యారు. పండుగరోజు కృష్ణానదిలో మునిగి ఇద్దరు విద్యార్ధులు చనిపోవడం బాధాకరమన్నారు. జరిగిన సంఘటనపై స్పందించిన ఆయన... మాట్లాడుతూ.. అమరేశ్వరాలయం వద్ద ఇసుక తవ్వకాలకు తనకుఏ సంబంధం లేదన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలసీతో ఇసుక నడుస్తుంది, దానికి ఎమ్మెల్యేగుంతలు తవ్వించారనడం దారుణమన్నారు. దమ్ముంటే చర్చకు రండి సిద్దంగా వున్నానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో మీరు తవ్విన గుంతల్లో పడి 23 మంది వ్యక్తులు మృతిచెందారన్నారు.
అమరావతి అమరేశ్వరాలయంలో ప్రమాణం చేద్దాం, ఎమ్మెల్యే శంకరరావు అవినీతి చేశాడని నిరూపణ చేయండి లేకపోతే మూసుకుని కూర్చోండి అన్నారు.పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే చూస్తూ వూరుకోం. అంటూ నంబూరు శంకరరావు మండిపడ్డారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News