హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

మాచర్లలోని

మాచర్లలోని చెన్నకేశవస్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పురాతన ప్రాంతాలు చాలా ఉన్నాయి. వందలు, వేల ఏళ్ల చరిత్ర గలిగిన ఊళ్లు, ఆలయాలకు లెక్కలేదు. రాయలవారి పాలనకు సజీవ సాక్ష్యం మన రాష్ట్రం. అలాగే చరిత్రలో నిలిచిన ఎందరో రాజులు పాలించిన రాజ్యాలు ఇక్కడుండేవి.

 • News18 Telugu
 • Last Updated :
 • Macherla, India

  Sumanth, News18, Guntur
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పురాతన ప్రాంతాలు చాలా ఉన్నాయి. వందలు, వేల ఏళ్ల చరిత్ర గలిగిన ఊళ్లు, ఆలయాలకు లెక్కలేదు. రాయలవారి పాలనకు సజీవ సాక్ష్యం మన రాష్ట్రం. అలాగే చరిత్రలో నిలిచిన ఎందరో రాజులు పాలించిన రాజ్యాలు ఇక్కడుండేవి. అలాగే పల్నాటి వీరులు ఏలిన నేల కూడా ఇక్కడే ఉంది. పల్నాడులో ఇప్పటికీ వారి అనవాళ్లు చెక్కుచెదర్లేదు. చెన్నునిపై పల్నాటి వాసులకు అపారమైన భక్తి భావం... చెన్నుడుని మనస్సు పెట్టి ప్రార్ధిస్తే అనుకున్నది జరిగి తీరుతుందన్న నమ్మకం... మహీష్పతి సామ్రాజ్యంలో కొలువైన చెన్నకేశవుడు నేటికి భక్తుల చేత విశేష పూజలందుకుంటున్నాడు. త్రేతా యుగంలో ప్రతిష్టతమై కలి యుగంలో పునఃప్రతిష్ట జరిగిన చెన్నకేశవ దేవాలయం భక్తులకు కొంగు బంగారంలా వర్ధిల్లుతోంది.
  ఆలయ చరిత్ర..!
  త్రేతా యుగంలో హైహయ రాజు కార్తవీర్యార్జునుడు మహీష్పతీ రాజ్యంలోని మాచర్లలో చెన్నకేశవ స్వామిని ప్రతిష్టించినట్లు పురణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఆలయం వివిధ రూపాయాల్లో అభివృద్ది చెందుతూ ఉంది. శైవదేవాలయంగా నిర్మించబడిన ఈ ఆలయం పల్నాటి రాజు బ్రహ్మనాయుడు కాలంలో వైష్ణవ దేవాలయంగా చెన్నకేశవ స్వామిని పునః ప్రతిష్టించిచట్లు చరిత్ర చెబుతుంది.

  ఇది చదవండి: ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే.. వెయ్యిమంది మునుల తపస్సు ఫలితం పొందుతారు..!


  అనుగురాజు తమ పూర్వీకులు చేసిన తప్పులను దిద్దుకునేందుకు నీలి బట్టలతో దీక్ష చేపట్టి అనేక తీర్ధాలలో మునుగుతూ వస్తున్నాడట. ఎక్కడైతే నీలి బట్టలు తెల్లగా మారతాయో అప్పుడు చేసిన పాపాలు తొలగిపోయినట్లు భావించాలని దైవ వాక్కు వినిపించిందట. అలా చంద్రవంక నది తీరంలోకి వచ్చి అక్కడ స్నానం చేయగానే నీలి బట్టలు తెల్లగా మారిపోయాట.

  ఇది చదవండి: చీరాల.. మళ్లీ మళ్లీ రావాల..! అక్కడ స్పెషల్ ఏంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..! ఇంతకీ ఏముందంటే..!  దీంతో అనుగు రాజు మాచర్లలో పాప విముక్తి జరిగిందని భావించి అక్కడ కొలువైన చెన్న కేశవ స్వామిని సేవించాడట. ఆ తర్వాత రాజ్యానికి వచ్చిన బ్రహ్మనాయుడు వీర వైష్ణవం పేరిట చెన్న కేశవ స్వామిని ఆరాధించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ చెన్న కేశవ స్వామిని పల్నాడు వాసులు అత్యంత్య భక్తి భావంతో కొలుస్తారు.

  ఇది చదవండి: యోగి వేమ‌నకు గుడికట్టి పూజలు, ఉత్సవాలు చేస్తున్నారు..? ఎక్కడో తెలుసా..!


  అబ్బురపరిచే ఆలయ కట్టడం..!
  ఆలయ నిర్మాణంలో పురాతన శిల్ప సంపద ఉట్టి పడుతుంది. నాలుగు స్థంభాలపై రామాయణ, భారత, భాగవతంలోని ముఖ్య ఘట్టాలను అత్యంత్య అద్భుతంగా కళ్లకు కట్టినట్లుగా చెక్కారు. మరొక స్థంభంపై దశావాతారాలు కొలువై ఉంటాయి. లక్ష్మీ దేవి సైతం ఇక్కడ కొలువై ఉంది. వేయిస్తంభాల గుడి శిల్పకళను పోలీ ఉంటుంది. 16 స్తంభాలతో గర్భాలయాన్ని అప్పటి శిల్పులు మనోహరంగా తీర్చిదిద్దారు.

  ఇది చదవండి: రక్తంతో అక్షింతలు.. పొలంలో చల్లితే మంచిదంట..! దీనికి శాస్త్రీయత కూడా.. వింత పండగ ఎక్కడంటే..!  దేవాలయం ఎదుట ధ్వజ స్థంభం పక్కనే నాలుగు అడుగుల బలి పీఠం కూడా ఉంది. ఈ పీఠంలో చెన్నకేశవ స్వామి ఉంటాడని…ఇక్కడ నుంచే స్వామి ఐతాంబకు దర్శనమిచ్చాడని ప్రతీతి. బ్రహ్మొత్సవాల సమయంలో బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ధ్వజ సంభానికి ఇరువైపుల వాహన మండపాలున్నాయి. గరుత్ముంతుడు, ఆంజనేయ స్వామి ఈ వాహన మండపాల్లో కొలువై ఉంటారు. ధ్వజ స్ధంభానికి కొద్దీ దూరంలోనే గిలకల బావి ఉంది. చంద్రవంక నుండి నీరు ఈ గిలకల బావిలోకి చేరుతుందని ప్రతీతి. గతంలో ఈ బావి నీటితోనే స్వామివారికి అభిషేకం చేసేవారంట.

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు తిరుమలలో దర్శనాలు రద్దు.. వివరాలివే..!


  ప్రతి ఏటా చైత్ర బహూళ పంచమి రోజు జరిగే రథోత్సవం కన్నలు పండుగుగా సాగుతోంది. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద రధోత్సవంగా దీనికి పేరుంది. కుల, మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు వీర వైష్ణవాన్ని ఆచరించినట్లు చరిత్ర చెబుతుంది. ఇందుకు ప్రతీకగానే కుల,మతాలకు అతీతంగా పల్నాడు వాసులందరూ ఈ రధోత్సవంలో పాల్గొంటారు.

  ఇది చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి బిజినెస్‌లోకి ఎంట్రీ..! దేశీ లస్సీతో గుంటూరు కుర్రాడి సక్సెస్‌..!


  బ్రహ్మనాయుడు చాపకూడా సిద్దాంతానికి కూడా ఈ ఆలయంలోనే పునాదులు పడ్డాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత్య వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరావు చెప్పారు. భక్తుల కోలాటం, భజన వంటివి ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంటారు. చంద్రవంక నది తీరంలో కొలువైన దీన జనబాంధవుడిగా పేరుగాంచిన చెన్న కేశవ స్వామిని ఒక్కసారైనా తనివి తీరా దర్శించుకోవాలని పల్నాటి వాసులు భావిస్తుంటారు. శ్రీనాథుడు ఈ ఆలయంలోనే పలనాటి వీరచరిత్ర రచనను ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి.


  దర్శన సమయాలు: ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1.30, సాయంత్రం 4.30 నుంచి 8.30 వరకు
  అడ్రస్‌: చెన్నకేశవస్వామి టెంపుల్‌ రోడ్డు, మాచర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌-522426.
  Guntur Macherla Chennakesava Swamy Temple Map
  ఎలా వెళ్లాలి?
  నరసరావుపేట, పిడుగురాళ్ల నుంచి మాచర్లకు బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. రైలుమార్గం ద్వారా అయితే పిడుగురాళ్లలో దిగి అక్కడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Hindu Temples, Local News

  ఉత్తమ కథలు