గులాబ్ తుపాను (Cyclone Gulab) నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్ తుపాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేయడంతో పాటు, కొన్నింటిని రైల్వే శాఖ దారి మళ్లించింది. కొన్నింటి గమ్యస్థానాలను కుదించారు. నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరింది. పలు రైళ్లను దారి మళ్లించారు. రైళ్ల సమాచారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రద్దు చేసిన రైళ్ల వివరాలు..
- 26.09.2021న స్టేషన్ నుంచి బయలు దేరేవి..
08445 - భువనేశ్వర్ - జగదల్పూర్
02097 - భువనేశ్వర్ - జునాగఢ్ రోడ్
08127 - రూర్కెలా - గునుపూర్
27.09.2021న స్టేషన్ నుంచి ప్రారంభమయ్యేవి..
08446 - జగదల్పూర్- భువనేశ్వర్
02098 - జునాగర్ రోడ్ - భువనేశ్వర్
08128 - గునుపూర్ - రూర్కెలా
Gulab Cyclone: ముంచుకొస్తున్న గులాబ్ తుఫాన్.. ఈ సమయంలో చేయాల్సినవి ఇవే..
మళ్లించిన రైళ్ల సమాచారం..
ఖరగ్‌పూర్, జర్సుగూడా, బల్హర్షా మీదుగా మళ్లించిన వివరాలు..
26.09.2021న స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే రైళ్ల వివరాలు
02703 - హౌరా - సికింద్రాబాద్
02245 - హౌరా-యశ్వంతపూర్
08645 -హౌరా-సికింద్రాబాద్ ప్రత్యేకం
02609 - సంత్రాగచి-తిరుపతి ప్రత్యేకం
02543 - హౌరా-చెన్నై సెంట్రల్ స్పెషల్
02663 - హౌరా-తిరుపతి ప్రత్యేకమైనది
08189 - టాటా-ఎర్నాకుళం
25.09.2021న స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే రైళ్లు ఇతర మార్గాలకు మళ్లించిన సమాచారం. 05488 - అగర్తలా- బెంగళూరు కాంట్
26.07.2021 న భువనేశ్వర్ నుంచి బయలుదేరే దారి మళ్లించిన రైళ్ల సమాచారం
01020 - భువనేశ్వర్-సిఎస్టి స్పెషల్ సంబల్పూర్, తిత్లాగఢ్, రాయ్‌పూర్ మీదుగా మళ్లించి నడుపుతారు.
03352 - అలప్పుజా- ధన్‌బాద్ స్పెషల్ 25.06.2021న అలప్పుజా నుంచి బయలుదేరి బల్హర్షా, జర్సుగూడ మీదుగా మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
Gulab Cyclone: గులాబ్ తుఫాన్ పరిస్థితిపై సీఎం జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ
02544 - చెన్నై సెంట్రల్- హౌరా స్పెషల్ 26.09.2021న చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి బల్హర్షా, జర్సుగూడ మీదుగా మళ్లించారు.
02064- 25.09.2021న యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే రైలు యశ్వంత్‌పూర్-పూరి బల్హర్షా, ఐబి, సంబల్పూర్ సిటీ మీదుగా మళ్లించారు.
26.09.2021న హైదరాబాద్ నుంచి బయలుదేరే రైలు నంబర్ 08646 హైదరాబాద్-హౌరా స్పెషల్ బల్హర్షా, జర్సుగూడ, ఖరగ్‌పూర్ మీదుగా మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
ట్రైన్ నంబర్ 02641 త్రివేండ్రం సెంట్రల్- షాలిమార్ స్పెషల్ 25.09.2021 న త్రివేండ్రం నుంచి బయలుదేరుతుంది.
26.09.2021 న తిరుపతి నుంచి బయలుదేరే రైలు నంబర్ 08480 తిరుపతి-భువనేశ్వర్ స్పెషల్ బల్హర్షా సంబల్పూర్ మీదుగా మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
రీ షెడ్యూల్ చేసిన రైళ్ల సమాచారం..
07480 - పూరి-తిరుపతి ప్రత్యేక పూరి వద్ద 11 గంటల రీషెడ్యూల్ చేశారు.
02873 - హౌరా-యశ్వంతపూర్ ప్రత్యేక హౌరా వద్ద 2 గంటల రీషెడ్యూల్ చేశారు.
02867 - హౌరా పాండిచ్చేరి ప్రత్యేక హౌరా వద్ద 2 గంటల రీషెడ్యూల్ చేశారు.
02704 - సికింద్రాబాద్-హౌరా సికింద్రాబాద్ వద్ద 3 గంటల రీషెడ్యూల్ చేశారు.
02246 - యశ్వంత్‌పూర్-హౌరా ప్రత్యేక రైలు యశ్వంత్‌పూర్‌లో 3 గంటల రీషెడ్యూల్ చేశారు.
07481 - తిరుపతి-బిలాస్పూర్ స్పెషల్ తిరుపతిలో 3 గంటల రీషెడ్యూల్ చేయబడింది.
08090 - తిరుపతి - హౌరా స్పెషల్ తిరుపతిలో 3 గంటల రీషెడ్యూల్ చేశారు.
02874 - యశ్వంతపూర్-హౌరా స్పెషల్ యశ్వంత్‌పూర్ వద్ద 3 గంటల రీషెడ్యూల్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cyclone, India Railways, Trains cancel