సీఎం జగన్‌పై ప్రశంసలు.. టాలీవుడ్ నటుడికి చేదు అనుభవం

జగన్ పాలన బాగుందంటూ ఆకాశానికెత్తారు. ఐతే ఈ కార్యక్రమంలో రాజకీయాలు ఎందుకంటూ స్టేజిపై ఉన్న అతిథులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ చందర్ తీరుపై అభ్యంతరం చెప్పి, వేదిక మీది నుంచి వెళ్లిపోయారు.


Updated: January 23, 2020, 11:09 PM IST
సీఎం జగన్‌పై ప్రశంసలు.. టాలీవుడ్ నటుడికి చేదు అనుభవం
విజయ్ చందర్, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ ఫిలిం అండ్ టెలివిజన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, వైసీపీ నేత, సినీనటుడు విజయ్ చందర్‌కు గుంటూరులో చేదు అనుభవం ఎదురైంది. కళావాహిని ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేదికపై ప్రసంగించిన విజయ్ చందర్.. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. జగన్ పాలన బాగుందంటూ ఆకాశానికెత్తారు. ఐతే ఈ కార్యక్రమంలో రాజకీయాలు ఎందుకంటూ స్టేజిపై ఉన్న  అతిథులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ చందర్ తీరుపై అభ్యంతరం చెప్పి, వేదిక మీది నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆయన కారులో వెళ్తుండగా స్థానికులు అడ్డుపడి ఆందోళన చేశారు. క్షమాపణ చెప్పాలని నినాదాలు చేయడంతో.. సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు విజయ్ చందర్.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు