Home /News /andhra-pradesh /

GUAVA FRUITS GETTING HUGE PROFITS AS THE PRICE COMPETING WITH APPLE IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

Guava Price in AP: యాపిల్ తో పోటీపడుతున్న జామకాయ.. ఒక్కసారి పంటవేస్తే అంత లాభమా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

జామ కాయ (Guava Fruit) అంటేనే నోరూరుతుంది చాలామందికి. కాయైనా పండైనా అది అమృతమే. పేదవాడి యాపిల్ (Apple) గా దీన్ని పిలుస్తారు. ఇప్పుడు అదే యాపిల్ ధర పెరిగింది. రైతులే యాపిల్‌ ధర పెంచేశారు. గతంలో రూపాయికి ఒక జామ కాయ ఇచ్చేవారు.అప్పటిలో సాగు కూడా తక్కు వగా ఉండేది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    P. Anand Mohan, News18, Visakhapatnam

    జామ కాయ (Guava Fruit) అంటేనే నోరూరుతుంది చాలామందికి. కాయైనా పండైనా అది అమృతమే. పేదవాడి యాపిల్ (Apple) గా దీన్ని పిలుస్తారు. ఇప్పుడు అదే యాపిల్ ధర పెరిగింది. రైతులే యాపిల్‌ ధర పెంచేశారు. గతంలో రూపాయికి ఒక జామ కాయ ఇచ్చేవారు.అప్పటిలో సాగు కూడా తక్కు వగా ఉండేది. అయితే ప్రస్తుతం సాగు పెరిగింది.. దిగుబడి పెరిగింది.. ధర కూడా అందేస్థాయిలో పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ జామ కాయ తినాలనేది వైద్యుల సూచన. దీంతో ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చిపడింది. ఐతే గతంలో ప్రతి ఇంటి పెరట్లో జామ చెట్టుండేది. అందుకే అప్పుడు రేట్లు కూడా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఇళ్లలో ఎక్కడ వెతికినా జామ చెట్ల జాడ కనిపించడం లేదు. దీంతో మార్కెట్లో జామకాయ కొండెక్కి కూర్చుంది.

    ప్రస్తుతం రైతు వద్ద 100 కాయలు రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. అంటే రైతు వద్ద ఒక్క జామ కాయ రూ.3లు పడుతోంది. వ్యాపారులు మార్కెట్‌లో కాయ సైజును బట్టి ఒక్కటి రూ.5 నుంచి రూ.10ల వరకు విక్రయిస్తున్నారు. కిలో రూ. 60 నుంచి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. పెద్ద కాయలు అయితే 5 మాత్రమే వస్తాయి. అంటే ఒక్కోకాయ రూ.20 అన్నమాట. పేదవాడికి అందుబాటులో ఉండే జామ యాపిల్‌ రేటుతో సమానంగా ఉండ డంతో జా మను కొనుక్కుందామనుకునే వారు ధర చూసి అయ్య బాబోయ్‌ అంటూ నోరెళ్ళబెడుతున్నారు.

    ఇది చదవండి: ఈ యాప్ చేతిలో ఉంటే చాలు.. ఎవరికీ, దేనికి భయపడక్కర్లేదు.. 87 రకాల సేవలు మీ అరచేతిలో..!


    జామ పంట (చెట్టు) నాటిన నుంచి ఏడాది కాలానికి ఫలసాయానికి వస్తుంది. దిగుబడి ప్రారంభమైన జామ పంట వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా, మామిడి ఫలాలు వచ్చే సమయం (వేసవికాలం)లో తక్కువగా దిగుబడి ఉంటుంది. మూడు నుంచి నాలుగేళ్ల పాటు పండించే జామ పంట వేసిన ఏడాది తరువాత ఎకరాకు రోజుకు 500 నుంచి చెట్టు ఎదిగే కొద్దీ ఒక్కోసారి వెయ్యు కాయల వరకు దిగుబడి వస్తుంది. మిగతా సమయాల్లో జామ ధర మెండుగా ఉన్నప్పటికీ, మామిడి ఫలాల సీజన్‌లో మా త్రం ధర అంతంత మాత్రంగానే ఉంటుంది. జామ సాగు చేసేందుకు భూమి శిస్తు, మొ క్కలు వేయడానికి, ఎరువులు,పురుగుమందులు ఇలా ఎకరా ఒక్కంటికి రూ.లక్ష పైమాటే ఖర్చు అవుతుంది.ఎకరాకు సుమారు రూ.2 లక్షల వర కూ ఆదాయం వస్తుంది. దీంతో రైతులు ఎక్కు వగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.



    ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పొట్టిలంక నుంచి జామకాయల ఎగుమతి ఎక్కువగా ఉంది. కడియం మండలంలో ప్రధానంగా పొట్టిలంక, దామిరెడ్డిపల్లి, వీరవరం, బుర్రిలంక, మాధవరాయుడుపాలెం, జేగురుపాడు గ్రామాల్లో ఉద్యానశాఖ గణాంకాల ప్రకారం 20 హెక్టార్లలో రైతులు జామ సాగు చేస్తున్నారు. అను నిత్యం పొట్టిలంక మార్కెట్‌గా ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ వంటి సుదూర ప్రాంతాలతో పాటు నరసాపురం, అమలాపురం, పాలకొల్లు, మార్టేరు, రాజోలు తదితర ప్రాంతాలకు ఎగు మతి అవుతుంటాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Fruits

    తదుపరి వార్తలు