Home /News /andhra-pradesh /

GROOM DIED JUST BEFORE WEDDING RITUALS BRIDE MARRIES ANOTHER PERSON ON SAME DAY IN KURNOOL SK

మరికొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు మృతి.. అదే రోజు మరో యువకుడిని పెళ్లి చేసుకున్న వధువు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Groom dies hours before wedding: మరికాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఛాతీ నొప్పితో మరణించాడు. అంతే.. అప్పటి వరకు బంధు మిత్రులతో కళకళలాడిన ఆ ఇల్లు.. ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది.

    ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు ఎటు వైపు నుంచి ఎలాాంటి ముప్పు మంచుకొస్తుందో మనకు తెలియదు. క్షణాల్లోనే అంతా తలకిందులయిపోవచ్చు. చూస్తుండగానే ఘోరం జరిగిపోవచ్చు. అప్పటి దాకా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వారు కూడా అకస్మాత్తుగా మరణించవచ్చు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన వరుడు ఊహించని విధంగా మరణించాడు. ఇంట్లో బంధుమిత్రుల సందడి నెలకొన్న సమయంలోనే అనారోగ్యంతో కుప్పకూలాడు. ఐతే అదే రోజు వధువు వేరొక యువకుడిని పెళ్లి చేసుకుంది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం గజ్జహల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    Andhra Pradesh: నడిరోడ్డుపై బీర్లే బీర్లు. ఫ్రీగా వస్తే వదులుతారా.. ఎగబడి ఎత్తుకెళ్లిన జనం

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్జహల్లి గ్రామానికి చెందిన ఓ యువతికి పెద్దకడబూరు మండలం చిన్న తుంబళం గ్రామానికి చెందిన హనీఫ్(23)తో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులు కూడా వివాహం వేడుకను చూసేందుకు వచ్చారు. మరికొన్ని గంటల్లో ముహూర్తం ఉందనగా.. ఘోరం జరిగిపోయింది.
    సరిగ్గా పెళ్లి క్రతువు జరిగే సమయంలో వరుడు కుప్పకూలిపోయాడు. హనీఫ్‌కు ఛాతిలో విపరీతమైన ఛాతీ నొప్పివచ్చింది. అతడిని హుటాహుటిన కర్ణాటకలోని శిరగుప్పలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. హనీఫ్‌ మరణించినట్లు ప్రకటించారు.

    Mega Support: వచ్చే ఎన్నికల్లో జనసేనకు మెగా మద్దతు.. అభిమానుల ప్రత్యేక సమావేశం.. ఏం డిసైడ్ అయ్యారంటే

    హనీఫ్ మరణించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సిన సమయంలో వరుడు ఆకస్మికంగా మరణించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఐతే హనీఫ్‌కు ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే.. వధువు తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. జరగరానిది ఏదైనా జరిగితే.. ఏంటని ఆలోచించారు. ముందుజాగ్రత్తగా తమ సమీప బంధువయిన ఓ యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏం జరిగిందో మొత్తం వివరించి.. తమ కూతురిని పెళ్లి చేసుకోవాల్సిదిగా కోరారు. ఆ తర్వాత కాసేపటికే హనీఫ్ మరణ వార్త తెలిసింది. ఈ క్రమంలో ముందుగా అనుకున్నట్లుగానే తమ సమీప బంధువుతో ఆ యువతి వివాహం జరిపించారు. హొళగుంద మండలం వందవాగిలి గ్రామానికి చెందిన నబిరసూల్‌తో వివాహం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు