వైసీపీ మార్క్ స్మశానాలు... పార్టీ కలర్స్‌తో హంగామా

Andhra Pradesh : ఏ పార్టీ అధికారంలో ఉంటే... ఆ పార్టీ జెండా రంగులు వెయ్యాల్సిందేనా? ప్రజల డబ్బులతో నిర్మిస్తున్న వాటికి... పార్టీ రంగులు ఎందుకు?

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 12:16 PM IST
వైసీపీ మార్క్ స్మశానాలు... పార్టీ కలర్స్‌తో హంగామా
స్మశానానికి వైసీపీ జెండా రంగులు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న వైసీపీ... మరిన్ని లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగుతోంది. ఐతే... ఆ పార్టీ కార్యకర్తలు చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఏంటంటే... గుంటూరు జిల్లాలోని... నరసరావుపేట నుంచి మాచర్ల వెళ్లే రోడ్డు మార్గంలో... ఓ స్మశానం ఉంది. దానికి వైసీపీ కార్యకర్తలు... తమ పార్టీ కలర్స్ వేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే... అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి... ఆ పార్టీ... ఎక్కడబడితే అక్కడ తమ పార్టీ జెండా గుర్తైన పసుపు రంగును వేసుకుందనీ, తెలంగాణలో టీఆర్ఎస్... ప్రభుత్వ కార్యక్రమాలకు గులాబీ రంగును వేసుకుంటున్నప్పుడు... తాము అధికారంలో ఉన్న ఏపీలో తమ పార్టీ గుర్తులు ఎందుకు వెయ్యకూడదని ప్రశ్నిస్తున్నారు.

స్మశానాలకు కూడా పార్టీ రంగులు అవసరమా అన్న ప్రశ్నకు వాళ్లు అవసరమే అని అంటున్నారు. ప్రభుత్వం చేసే ప్రతీ పనినీ ప్రజలకు తెలియజేస్తున్నామనీ... టీడీపీ లాగా తాము అక్రమాలకు పాల్పడట్లేదనీ... అందువల్ల తాము ఏం చేసినా తెలిసేలా... తమ పార్టీ రంగులు వేస్తున్నామని అంటున్నారు. అయితే... ప్రజల డబ్బుతో నిర్మిస్తున్న వాటికి... పార్టీ డబ్బుతో నిర్మిస్తున్నట్లు పార్టీ కలర్స్ ఎందుకు వేస్తున్నారన్న ప్రశ్న స్థానిక టీడీపీ మద్దతు దారుల నుంచీ వస్తోంది. ఈ విషయంపై మాత్రం ఇంకా వైసీపీ కార్యకర్తలు స్పందించలేదు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు