T. Murali Krishna, News18, Kurnool
ఇటీవల కలకలం సృష్టించిన మర్డర్ కేసు పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలను మీడియాకు వెల్లడించారు. కర్నూల్ పట్టణంలోని స్థానిక మాధవి నగర్ లో నివాసం ఉంటున్న.మెడవరం సుబ్రహ్మణ్యం, వయస్సు 84 ఏళ్లు, తండ్రి పేరు లేట్ శివ రామయ్య అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నందు సీనియర్ -అసిస్టెంట్ పని చేస్తూ 1996వ సంవత్సరంలో రిటైర్ అయి ప్రస్తుతం ఇంట్లో వున్నాడు.
సదరు వ్యక్తిని 03.12.2022 వ తేదీన ఉదయము 08.30 నుండి 09.30 గంటల మధ్యలో ఇంటిలో ఎవరు లేని సమయములో ఇంటి హాల్ నందు మంచం మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోనికి ప్రవేశించి గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.మెడవరం సుబ్రహ్మణ్యం కొడుకు/ఫిర్యాది అయిన మేడవరం రమేశ్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూల్ 3 వ పట్టణ పోలీసు CR.NO. 507/2022, U/S 302 IPC కేసులో నమోదు చేయడమైనది.
పై కేసులో విచారణ అధికారి అయిన యం.తద్రిజ్ మొదటి నుంచి అనుమానితునిగా వున్న ముద్దాయిని దర్యాప్తులో భాగముగా నిఘా వుంచి 06.12.2022 వ తేదీన ఉదయం 09.00 గంటలకు మహాలక్ష్మి నగర్ లోని శ్రీ సాయి క్రిష్ణ డిగ్రీ కాలేజ్ నుండి 100 ఫీట్ రోడ్డురస్తాలోముద్దాయిని కర్నూలు 3 వ పట్టణ సీఐ తబ్రెజ్, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ సింగ్, కానిస్టేబుల్ చంద్ర బాబు నాయుడులతో పాటు వెళ్ళి ముద్దాయిని పట్టుకున్నారు. అనంతరం విచారించగ ముద్దాయి... హతుడుతన తాత సుబ్రమణ్యమని, తనని పౌరహిత్యము నేర్చుకోమని బలవంతం చేయటం మరియు తనని ప్రతి చిన్న విషయనికి తిట్టేవాడని, అనవసరమైన ఖర్చులు చేస్తూ, అల్లరిగా తిరుగుతూ ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ, పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావని అరిచాడని..ఈ సారి నిన్ను ట్రీట్మెంట్ కొరకు మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాను అని ఇష్టం వచ్చినట్లుగా తింటాడని.. తనని ఇంటి నుండి వెల్లగొట్టిహాస్పిటల్లో జాయిన్ చేయిస్తాడనే భయంతో క్షణికావేశంలో....వంటగదిలోఉన్న మూడు కత్తులు తీసుకొని హాలులో నిలబడి వున్న తాతని కత్తితో విచక్షణ రహితముగా గొంతు కోసి, గుండెల పై పొడిచినట్లు తెలిపాడు.
చనిపోయినాడు అని నిర్ధారించుకున్న అనంతరంతన శరీరంపై బట్టలపై రక్తము అయినందున సదరు బట్టలు తీసివేసి స్నానము చేసి ఎవరికి అనుమానం రాకుండా రక్తపు మరకల బట్టలనుమహాలక్ష్మి నగర్ లోని శ్రీ సాయి క్రిష్ణ డిగ్రీ కాలేజ్ నుండి 100 ఫీట్ రోడ్డుకు పోవు రస్తాలో ముళ్ల కంపలో పడవేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో ముద్దాయిని అరెస్టు చేసిన పోలీసులురిమాండ్కిపంపడమైందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News