• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • GRAND FATHER TAKEN BRIDE ALONG WITH HIM FROM MARRIAGE FUNCTION HALL INCIDENT HAPPENED IN ANANTAPUR HSN

ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

పెళ్లి జరగాల్సిన కల్యాణ మండపం (ఫైల్ ఫొటో)

తాజాగా ఓ విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లి వరుడికి, వధువుకి ఇష్టమే అయినా, తాత ఎంట్రీతో పెళ్లి వేడుకలో ఊహించిన ట్విస్ట్ జరిగింది. కొద్ది గంటల్లో పెళ్లనగా పెళ్లి మండపం నుంచి వధవును ఆ తాత ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లిపోయాడు.

  • Share this:
    కొద్ది సేపు ఆగు, నా ప్రియుడు వస్తాడు.. అంటూ పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు, వరుడితో చెప్పిన ఘటనను గురించి విని ఉంటారు. కొద్ది గంటల్లో పెళ్లనగా పెళ్లి మండపం నుంచి ఎస్కేప్ అయిన పెళ్లి కూతుళ్ల గురించి చదివి ఉంటారు. పెళ్లి ఇష్టం లేక చెప్పాపెట్టకుండా పెళ్లి వేదిక వద్ద నుంచి మాయమైన పెళ్లి కొడుకుల గురించి కూడా టీవీల్లో చూసి ఉంటారు. కానీ తాజాగా ఓ విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లి వరుడికి, వధువుకి ఇష్టమే అయినా, తాత ఎంట్రీతో పెళ్లి వేడుకలో ఊహించిన ట్విస్ట్ జరిగింది. కొద్ది గంటల్లో పెళ్లనగా పెళ్లి మండపం నుంచి వధవును ఆ తాత ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లిపోయాడు. దెబ్బకు పెళ్లి ఆగిపోయింది. తాము ఈ పెళ్లి కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టామంటూ పోలీసులను వరుడి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కానీ ఆ పోలీసులు వారికే షాకిచ్చారు. ఈ పెళ్లి చేసుకోవద్దని హితవు పలికారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    అనంతపురం జిల్లా ఓడీసీ మండలం అచ్చేమియాపల్లికి చెందిన శ్రీరాములు కుమారుడు శ్రీనివాసులుకు పుట్టపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయించారు. వాస్తవానికి బుధవారం ఉదయం గోరంట్లలోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లికి అయ్యే ఖర్చును తామే భరిస్తామని వరుడి తరపు వారు ఒప్పుకున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రానికి వధువరులిద్దరితో సహా వారి కుటుంబసభ్యులు కల్యాణమండపానికి చేరుకున్నారు. అయితే మంగళవారం రాత్రి ఫొటోషూట్ నిర్వహించాలని వరుడు భావించాడు. రాత్రిపూట వధువును మండపంలోకి పిలిచి పక్కపక్కనే నిలబెట్టి ఫొటోలు తీస్తున్నారు.
    ఇది కూడా చదవండి: సెలూన్‌లో పనిచేసే 23 ఏళ్ల కుర్రాడు.. హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ యువతి.. కులం, మతం వేరైనా ఆమె పెళ్లికి సిద్ధపడినా..

    దీంతో సడన్ గా ఆ అమ్మాయి తాత ఎంట్రీ ఇచ్చాడు. ‘పెళ్లి కాకముందే వధూవరులిద్దరిని పక్క పక్కన నిలబెట్టి ఫొటోలు తీయడమేంటి? ఇది అసలు పద్దతేనా? ఇవేం ఆచారాలు‘ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయమై వారి మధ్య గొడవే జరిగింది. అయితే బంధువుల జోక్యంతో వివాదం ముగిసింది. ఫొటోల తంతు ఆగిపోయింది. అయితే వరుడి తరుపు వారి ప్రవర్తన ఆ తాతకు చిరాకు తెప్పించింది. దీంతో కొద్ది గంటల్లో పెళ్లనగా, వదువును బుధవారం తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా తన వాహనంలో సొంతూరికి తీసుకెళ్లిపోయాడు. తెల్లారిన తర్వాత చూస్తే వధువు, ఆమె తాత కనిపించలేదు. ఫోన్ చేస్తే ఊళ్లో ఉన్నా.. పెళ్లిలేదు ఏం లేదు మీరు కూడా వచ్చేయండి అంటూ తాపీగా సమాధానం చెప్పాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది.
    ఇది కూడా చదవండి: నీ నాలుగేళ్ల కొడుకు వల్ల నీకు ప్రాణహాని.. అని చెప్పిన జ్యోతిష్కుడు.. దారుణానికి తెగించిన తండ్రి.. అసలేం జరిగిందంటే..

    బుధవారం ఒక్కొక్కరుగా పెళ్లికి వచ్చిన బంధువులకు ఈ విషయం తెలిసింది. వారంతా సాయంత్రం వరకు వేచిచూసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. పెళ్లికి మూడు లక్షల వరకుఖర్చు పెట్టుకున్నామనీ ఇదంతా తమకు నష్టమేననీ వరుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అయితే సొంత మండలంలో ఫిర్యాదుచేసుకోవాలని పోలీసుల సూచనతో పుట్టపర్తి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారు వధువు గ్రామానికి వెళ్లి ఆమె బంధువులతో చర్చించారు. అయితే విచారణలో వారికి ఓ నిజం తెలిసింది. ఆ వధువు మైనర్ అని వారికి నిజం తెలిసింది. దీంతో వధువు మైనర్ కావడంతో పెళ్లి చేయొద్దని చెప్పడంతోపాటు, ఇదే విషయమై వరుడి తరపు వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. నష్టం గురించి అవసరమైతే కేసు పెట్టుకోవచ్చని సూచించారు. అయితే పెద్దమనుషుల ద్వారా వారిద్దరికీ పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాల తరుపు వారు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.
    ఇది కూడా చదవండి: పెళ్లి కాని అమ్మాయిలే అతడి టార్గెట్.. అందమైన అబ్బాయిల ఫొటోలతో వల.. హైదరాబాద్ లో కొత్త మోసం వెలుగులోకి..!
    Published by:Hasaan Kandula
    First published: