హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

New Salaries: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త జీతాలు

New Salaries: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త జీతాలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ (Grama, Ward Sachivalayam) ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. రాష్ట్రంలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ (Grama, Ward Sachivalayam) ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. రాష్ట్రంలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. 2019 అక్టోబర్ నుంచి ఉద్యోగాల్లో చేరారు. రెండేళ్ల తర్వాత ప్రభుత్వం వారికి ప్రొబేషన్ ఖరారుచేసింది. ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్ మెంటల్ టెస్టులు నిర్వహించి అందులో ఉత్తీర్ణులైనవారిని పర్మినెంట్ చేసింది. ఐతే ఈ ప్రక్రియ కొన్ని నెలలు ఆలస్యమైనా ఎట్టకేలకు జూలై 1న అందరినీ శాశ్వత ఉద్యోగులుగా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. జూలై 1 నుంచి పే-స్కేల్ తో పాటు ఇతర అలవెన్సులతో కూడిన జీతాల జీవితాలతో తీసుకొచ్చింది. ఈ మేరకు ఆగస్టు 1న ఉద్యోగులంతా పెరిగిన కొత్త జీతాలు అందుకోనున్నారు.

ఇదిలా ఉంటే పీఆర్సీ కమిటీ చెప్పకపోయినా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కొత్త పే స్కేల్ లో చేర్చింది ప్రభుత్వం. 2018లో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసే సమయానికి ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లేదు. కానీ ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా వారిని పే స్కేల్ లో చేర్చింది. ఇదిలా ఉంటే ఒకేసారి 1.34లక్షల మంది ఉద్యోగులను పే స్కేల్ లో చేర్చేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జూలై 20వ తేదీ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి ఈ ప్రక్రియను పర్యవేక్షించిన ప్రభుత్వం.. జీతాల బిల్లులను సమర్పించే అధికులతో రివ్యూలు నిర్వహించింది.

ఇది చదవండి: ఈ తేదీల్లో తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా..? ఈ శుభవార్త మీ కోసమే..!


పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు చూస్తే.. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5కి 23,120-74,770గా ఖరారు చేశారు. మిగిలిన పోస్టులకు రూ.22,460-72,810గా ఫిక్స్ చేశారు. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి రూ. 23,120-74,770గా పేర్కొంది. ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ, డీఏలు అదనంగా రానున్నాయి.

ఇది చదవండి: ఏపీలో కోట్లు పలికిన బార్ లు.. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. వివరాలివే..!


ప్రభుత్వం పేర్కొన్న పే స్కేల్లో మూలవేతనానికి అలవెన్సులు కవడంతో ఒక్కొక్కరికి దాదాపు రూ.30వేల వరకు జీతాలు వచ్చే అవకాశముంది. వీటిలో గ్రామ సచివాలయ ఉద్యోగులతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో పనిచేసే వార్డు సచివాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఆధారంగా జీతాలు ఎక్కువ వచ్చే అవకాశముంది.

ఇది చదవండి: సాయి ప్రియాంక కేసులో మరో ట్విస్ట్.. కేసు నమోదుకు రంగం సిద్ధం..! కారణం ఇదే..!


2019లో ఉద్యోగాలకు ఎంపికన వారందరికీ రెండేళ్లపాటు ప్రొబేషన్ ఉంటుందని అప్పట్లోనే ప్రభుత్వం తెలిపింది. ఈ రెండేళ్లు నెలకు రూ.15వేల చొప్పున జీతాన్ని ఖరారు చేసింది. వీరిలో 2021 అక్టోబర్ 2 నాటికి 40వేల మంది, 2021 అక్టోబర్ 30నాటికి 30వేల మంది, 2021 నవంబర్ నెలాఖరుకు 50వేల మంది రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది.

First published:

Tags: Andhra Pradesh, Ap grama sachivalayam

ఉత్తమ కథలు