ప్రకటన జోరు... అమలు బేజారు... దిక్కులు చూస్తున్న గ్రామ వాలంటీర్లు

జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వం... ఉన్నతాశయాలతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించింది. ఐతే... కొన్ని సమస్యలు ఈ వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. అవేంటో చూద్దాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 22, 2019, 1:49 PM IST
ప్రకటన జోరు... అమలు బేజారు... దిక్కులు చూస్తున్న గ్రామ వాలంటీర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెప్టెంబర్ 1న గ్రామ వాలంటీర్లంతా... తమకు అప్పగించిన 50 ఇళ్లకూ... రేషన్ సరుకులు సప్లై చేయాల్సి ఉంది. ఐతే... ఇప్పటివరకూ చాలా మంది వాలంటీర్లు... చాలా ఇళ్లకు వెళ్లనే లేదు. వివరాలు రాసుకున్నదీ లేదు. ఈ విషయంలో వాళ్ల తప్పేమీ లేదు. ప్రభుత్వం నుంచే పొరపాటు కనిపిస్తోంది. ఎందుకంటే... ఆగస్ట్ 15న గ్రామ, వార్డ్ వాలంటీర్లు పనుల్లో దిగారు. అధికారులు ఒక్కొక్కరికీ 50 ఇళ్ల చొప్పున అప్పగించారు. వాటి ప్రాథమిక సమాచారం సేకరించాలని ఆదేశించారు. అలా చెయ్యడానికి... వాళ్లకు మిగిలివున్న గడువు మరో మూడ్రోజులే. ఆగస్ట్ 25కల్లా... ప్రతీ గ్రామ వాలంటీర్, వార్డ్ వాలంటీర్... తనకు అప్పగించిన 50 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని రెడీగా ఉంచుకోవాలి. ఆ ఇళ్లలో ఎంత మంది ఉంటున్నారు. చదువుకుంటున్నదెవరు? ఎవరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు? పెన్షన్లు ఎంతమందికి ఇవ్వాలి? ఇలాంటి సమాచారం మొత్తం వాలంటీర్ల దగ్గర ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వం... 13 పేజీల బుక్ లెట్ ఇచ్చింది. కానీ ఈ బుక్ లెట్ వాలంటీర్లకు ఏమాత్రం సరిపోవట్లేదు.

ఒక్కో ఇంటి సమాచారం రాసుకోవడానికి... మూడు నాలుగు పేజీలు అవసరం అవుతున్నాయి. ఆ లెక్కన ఒక్క బుక్ లెట్... నాలుగైదు ఇళ్లకు మించి రావట్లేదు. అందువల్ల ప్రతీ వాలంటీర్‌కీ అదనంగా... మరో 9 బుక్‌లెట్ల చొప్పున కావాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.500 నుంచీ రూ.1000 దాకా అవుతుంది. సేకరించిన సమాచారాన్ని టైపింగ్, ప్రింటింగ్ చెయ్యించాలంటే... మరో రూ.2000 దాకా అవసరం. ఈ నిధులు తమకు అందించాలని వాలంటీర్లు కోరుతున్నా... అధికారుల నుంచీ ఆన్సర్ రావట్లేదు. ఎందుకంటే... ఇలా మనీ అవసరం అవుతుందని ముందుగా అధికారులు అంచనా వెయ్యకపోవడమే కారణంగా తెలుస్తోంది.

ఆదిలోనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇలా అయిపోవడంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టినప్పుడు... ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎంత త్వరగా సెటిల్ చేస్తూ పోతే... అంతలా ఆ కార్యక్రమం విజయవంతం అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఐతే... అధికారులు ఆలోచిస్తూ కూర్చుంటే కుదరని పని. ఎందుకంటే... ఎక్కువ సమయం లేదు. సెప్టెంబర్ 1న ప్రతీ ఇంటికీ... గ్రామ వాలంటీర్లు, వార్డ్ వాలంటీర్లే... రేషన్ సరుకులు... ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. అది జరగాలంటే... ముందుగా వాళ్లకు ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది. సీఎం జగన్... అమెరికా నుంచీ వచ్చాక... అధికారులు ఆయనకు విషయం చెప్పి... నిధులు విడుదల చేయించి... వాలంటీర్లకు ఇచ్చి... పరిష్కారం అయ్యేలా చేస్తే... తప్ప... రేషన్ సరుకులు సజావుగా ఇళ్లకు వచ్చే అవకాశాలు లేవు.
Published by: Krishna Kumar N
First published: August 22, 2019, 1:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading