ఏపీలో గ్రామ వాలంటీర్ అరెస్ట్...

అక్రమంగా మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న గ్రామ వాలంటీర్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: April 17, 2020, 2:19 PM IST
ఏపీలో గ్రామ వాలంటీర్ అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గ్రామ వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట గ్రామంలో గ్రామ వాలంటీర్ అక్రమంగా మద్యం వక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిపై ఆరోపణలు రావడంతో నిఘా పెట్టారు. తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం బాటిళ్లు తీసుకొచ్చి అమ్మకాలు చేస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలోని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, పింఛన్ల వంటి వాటిని గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అందజేస్తున్న ఏపీ ప్రభుత్వం... కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో వారి సేవలను మరింతగా వినియోగించుకుంటోంది. గ్రామ వాలంటీర్ల కారణంగానే ఏపీలో ప్రజలకు నిత్యావసరాలు సకాలంలో అందుతున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: April 17, 2020, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading