సీఎం జగన్‌ను తిట్టిన గ్రామ వాలంటీర్... సోషల్ మీడియాలో వైరల్...

కర్నూలు జిల్లా మిడుతూరు గ్రామ వాలంటీర్ హరిప్రసాద్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

news18-telugu
Updated: December 12, 2019, 2:31 PM IST
సీఎం జగన్‌ను తిట్టిన గ్రామ వాలంటీర్... సోషల్ మీడియాలో వైరల్...
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడో గ్రామ వాలంటీర్. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా మిడుతూరు గ్రామ వాలంటీర్ హరిప్రసాద్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సప్ గ్రూపుల్లో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వాలంటీర్ హరిప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిన పోలీసులు విచారిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లబ్ధిదారులకు ఇంటింటికి రేషన్ సరఫరా చేయడానికి ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్‌ను నియమించారు. సుమారు 4లక్షలకు పైగా గ్రామ వాలంటీర్లను నియమించి వారికి నెల నెలా గౌరవవేతనం కింద సుమారు రూ.5వేలు చెల్లిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 12, 2019, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading