లారీని ఢీకొన్న గవర్నర్‌పేట ఆర్టీసీ బస్సు...ఇద్దరు మృతి

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం దగ్గర సోమవారం ఈ  రోడ్డు ప్రమాదం జరిగింది. 

news18-telugu
Updated: February 12, 2019, 5:08 AM IST
లారీని ఢీకొన్న గవర్నర్‌పేట ఆర్టీసీ బస్సు...ఇద్దరు మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 5:08 AM IST
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో  ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం దగ్గర సోమవారం ఈ  రోడ్డు ప్రమాదం జరిగింది.   అటుగా వస్తున్న  లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో కండక్టర్‌ సహా ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా.. 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు.. కృష్ణా జిల్లా గవర్నర్‌పేట డిపోకు చెందినదిగా తెలుస్తోంది. ఈ  బస్సు గవర్నర్‌పేట  నుండి హైదరాబాద్‌ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  అయితే ఈ  ప్రమాదంపై మాచారం అందుకున్న పోలీసులు వెంటనే  ప్రమాద స్థలానికి చేరి  క్షతగాత్రులను దగ్గరలోని దవాఖానకు తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు..గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...