GOVERNOR BISWA BHUSHAN HARICHANDAN HOSTED HIGH TEA FOR CJI NV RAMANA AS AP CM YS JAGAN ATTENDED THE EVENT FULL DETAILS HERE PRN
CJI at Rajbhavan: సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు.. హాజరైన సీఎం జగన్
రాజ్ భవన్ లో సీజేఐకి గవర్నర్ తేనీటి విందు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ (CJI NV Ramana) గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Bishwa Bhushan Harichandan) రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. మూడు రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ.., గవర్నర్ ఆహ్వానం మేరకు రాజ్ భవన్ కు వెళ్లారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ (CJI NV Ramana) గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Bishwa Bhushan Harichandan) రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. మూడు రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ.., గవర్నర్ ఆహ్వానం మేరకు రాజ్ భవన్ కు వెళ్లారు. ఎన్వీ రమణ దంపతులకు రాజ్ ఫవన్ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలకగా, పోలీసుల నుండి గౌరవ వందనం సమర్పించారు. అప్పటికే రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం జగన్ (AP CM YS Jagan) దంపతులు.. సీజేఐను దర్బార్ హాల్ కు తొడ్కొని వెళ్లారు. దర్బార్ హాల్ లో గవర్నర్ తో భేటీ అయిన సీజే.. రాష్ట్రాభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై కాసేపు చర్చించారు.
కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినీత్ శరణ్, జెకె మహేశ్వరి దంపతులు పాల్గొనగా.. ఏపీ ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, అదనపు కార్యదర్శులు ధనుంజయ రెడ్డి, ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ నివాస్, సిపి కాంతి రాణా టాటా, ఐఎఎస్ అధికారులు కృతికా శుక్లా, షన్ మోహన్, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి, రాజ్ భవన్ ఉపకార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్ భవన్ లో తేనీటి విందు ముగిసిన అనంతరం సీజేఐ బెజవాడ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లారు. దీంతో జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ పర్యటన ముగియనుంది.
ఆదివారం మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ రమణ.. రాజధాని అమరావతికి వెళ్లి హైకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా హైకోర్టు బార్ అసోసియేషన్ ఆయన్ను ఘనంగా సన్మానించింది. అనంతరం మాట్లాడిన ఆయన..న్యాయవ్యవస్థ సమాజానికి మార్గదర్శి వంటిదన్నారు. హైకోర్టులో చాలా కేసులు పెండింగ్ లో ఉన్న సంగతి తెలసని.. త్వరలో ఖాళీగా ఉన్న జడ్జిల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన అన్నారు. తాను ఈ ప్రాంతానికి చెందిన వాడినని.. మీ అందరి వాడినని.. మీ అందరి అదరాభిమానలతోనే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. న్యాయశాఖ కీర్తిని పెంచేలా న్యాయవాదులు, న్యాయమూర్తులు వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.