హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ammovodi Update: తల్లిదండ్రులకు అలర్ట్.. అమ్మఒడిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. కారణం ఇదేనా..!

Ammovodi Update: తల్లిదండ్రులకు అలర్ట్.. అమ్మఒడిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. కారణం ఇదేనా..!

గత వారం రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం పాఠశాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పాలి.. స్కూళ్లలో కఠిన నిబంధనలు పాటించడం.. ప్రార్ధనలు, ఆటలు రద్దు చేయం.. నిత్యం శానిటైజర్ చేయించడం లాంటి చర్యలతో కేసులు అదుపులోకి వస్తున్నాయి.

గత వారం రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం పాఠశాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పాలి.. స్కూళ్లలో కఠిన నిబంధనలు పాటించడం.. ప్రార్ధనలు, ఆటలు రద్దు చేయం.. నిత్యం శానిటైజర్ చేయించడం లాంటి చర్యలతో కేసులు అదుపులోకి వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) నవరత్నాలులో భాగంగా అమ్మఒడి పథకాన్ని (Ammavodi Scheme) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఏడాదికి రూ.15వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) నవరత్నాలులో భాగంగా అమ్మఒడి పథకాన్ని (Ammavodi Scheme) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఏడాదికి రూ.15వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే వరుసగా రెండేళ్లు పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం మూడో ఏడాదికి సంబంధించి స్వల్ప మార్పులు చేసింది. ఈ పథకం కింద కోరుకున్నవారికి ల్యాప్ టాప్ లు కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఐతే రెండేళ్లపాటు జనవరిలో అమ్మఒడి నగదు జమ చేసిన ప్రభుత్వం.. ఈసారి ఈ ప్రక్రియను జూన్ నెలకు మార్చింది. అలాగే 75శాతం హాజరుశాతం ఉన్న విద్యార్థులకు మాత్రం ఈ పథకం వర్తించనుంది. ఏప్రిల్ 30 వరకు విద్యార్థుల హాజరును పరిగణలోకి తీసుకొని నగదు జమ చేయనున్నారు.

అమ్మఒడి పథకంలో హాజశాతంపై విద్యార్థులుతో పాటు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఇటీవల ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. ఇప్పటికే విద్యార్థుల హాజరును ప్రతిరోజూ యాప్ లో ఫోటోలతో సహా అప్ లోడ్ చేయవలసి వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖ పంపిస్తోంది. సదరు లేఖపై తల్లిదండ్రులు సంతకం చేసి పంపాల్సి ఉంటుంది.

ఇది చదవండి: ఏపీకి కాబోయే సీఎస్ ఆమేనా..? సీఎం జగన్ మనసులో ఏముంది..?


నవంబర్ 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30లోపు అంటే 130 రోజుల్లో తమ పిల్లలను 75శాతం హాజరుకు తగ్గకుంటా స్కూలుకు పంపుతామని తెలియపరుస్తూ లేఖపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఒకవేళ అమ్మఒడి రాకపోయినా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాలల నుంచి వస్తున్న ఈలేఖలపై కొందరు తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని అధారంగా అమ్మఒడి నుంచి తప్పిస్తారేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు.

ఇది చదవండి: మళ్లీ చుక్కలు చూపిస్తున్న టామాట.. మార్కెట్ కి వెళ్తే మాటలు రావు..


ఏపీ ప్రభుత్వం రెండేళ్ల నుంచి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా దాదాపు 80లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6వేల కోట్లకు పైగా రెండేళ్లలో దాదాపు రూ.13 వేల కోట్లు జమచేసింది. గత రెండేళ్లు జనవరి 9వ తేదీన నగదు జమ చేసిన ప్రభుత్వం.. విద్యార్థుల హాజరును పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో జూన్ కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

First published:

Tags: Andhra Pradesh, Ap government, Ap welfare schemes

ఉత్తమ కథలు